తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Next Cm : సిద్ధరామయ్య వర్సెస్​ డీకే శివకుమార్​.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు?

Karnataka next CM : సిద్ధరామయ్య వర్సెస్​ డీకే శివకుమార్​.. కర్ణాటక తదుపరి సీఎం ఎవరు?

Sharath Chitturi HT Telugu

13 May 2023, 12:49 IST

    • Karnataka next CM : మెజారిటీ మార్కును దాటి ఆధిపత్యం కొనసాగిస్తుండటంతో.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.
సిద్ధరామయ్య వర్సెస్​ డీకే శివకుమార్​..
సిద్ధరామయ్య వర్సెస్​ డీకే శివకుమార్​.. (HT)

సిద్ధరామయ్య వర్సెస్​ డీకే శివకుమార్​..

Karnataka election results : కర్ణాటక కాంగ్రెస్​ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. బీజేపీ క్యాంపు వెలవెలబోతోంది. దీని బట్టి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధికార బీజేపీకి గట్టి షాక్​నిస్తూ.. కాంగ్రెస్​ దూసుకెళుతోంది. మధ్యాహ్నం 12 గంటల నాటికే దాదాపు 125 సీట్లల్లో ఆధిక్యంలో (మ్యాజిక్​ ఫిగర్​ 113) కొనసాగుతోంది. చివరి నిమిషంలో ఒడిదొడుకులు లేకపోతే.. కాంగ్రెస్​ గెలుపు ఖాయమేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో తదుపరి సీఎం ఎవరు? అన్న విషయం హాట్​ టాపిక్​గా మారింది.

సిద్ధరామయ్య వర్సెస్​ డీకే శివకుమార్​..

ఇప్పటివరకు ఏ పార్టీ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే.. కాంగ్రెస్​ సీఎం అభ్యర్థిపై ఎన్నికల ప్రచారాల నుంచే చర్చలు విపరీతంగా జరిగాయి. ఈ చర్చలతో పార్టీలో విభేదాలు కూడా ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షుడు డీకే శివకుమార్​లు ఉన్నారు.

Karnataka next CM : 'నేనే సీఎం అభ్యర్థిని' అని సిద్ధరామయ్య ఇప్పటికే అనేకమార్లు ప్రకటించారు. ఇదే తన చివరి ఎన్నిక అని, అధిష్ఠానం తననే సీఎం చేయాలని.. వాస్తవానికి డిమాండ్​ చేసే విధంగానే మాట్లాడారు. కానీ అధిష్ఠానం దీనిపై మౌనంగానే ఉంటూ వచ్చింది.

తాజా ఎన్నికల ఫలితాల మధ్య.. సిద్ధరామయ్య తనయుడు యథీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సీఎం అవ్వాలని అభిప్రాయపడ్డారు.

Karnataka election results 2023 live : "కాంగ్రెస్​ గెలుస్తుందని నాకు తెలుసు. ఇది ప్రజల తీర్పు. కాంగ్రెస్​కు మెజారిటీ లభిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక కుమారుడిగా.. నా తండ్రి సీఎం అవ్వాలని నేను కోరుకుంటాను. గతంలో ఆయన హయాంలో రాష్ట్రాభివృద్ధి జరిగింది. మంచి పాలనతో పేరు వచ్చింది. ఇప్పుడాయన సీఎం అయితే.. బీజేపీ అక్రమాలను సరిచేసే అవకాశం ఉంటుంది," అని శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారు యథీంద్ర.

ఎన్నికల ప్రచారాల సమయంలోనే సిద్ధరామయ్య మాటలు డీకే శివకుమార్​ వర్గానికి నచ్చలేదని తెలుస్తోంది. శివకుమార్​ సీఎం అవ్వాలని వారు కోరుకుంటున్నట్టు సమాచారం. డీకే శివకుమార్​.. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీకి సన్నిహితుడన్న విషయం తెలిసిందే. సీఎం కుర్చీ విషయంపై ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు కూడా పుట్టుకొచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. పార్టీ గెలుపే ముఖ్యమని అనుకుని, ఇద్దరు కలిసి ఎన్నికల్లోకి దిగారని సమాచారం.

రేసులో మల్లిఖార్జున ఖర్గే..!

Siddaramaiah Congress : కర్ణాటక సీఎం రేసులో కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరు కూడా వినిపించింది. దీనిపై ఆయన ఎప్పుడు స్పందించలేదు. కర్ణాటకవాసి, దేశ రాజకీయాల్లోనే సీనియర్​ నేత కావడంతో.. ఈయన పేరు వినిపిస్తోంది. ఖర్గే సీఎం అయితే.. తనకు ఇబ్బందులు లేవని ఇప్పటికే చెప్పారు డీకే శివకుమార్​.

ఆ మీటింగ్​లో ఫిక్స్​ చేస్తారా..?

DK Shivakumar Congress CM : స్పష్టమైన ఆధిపత్యంలో ఉండటంతో కాంగ్రెస్​ వేగంగా పావులు కదుపుతోంది. ఎమ్మెల్యేలందరినీ సంప్రదిస్తోంది. పార్టీ ఫిరాయింపులు ఉండకుండా చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆదివారం ఉదయం బెంగళూరులో సీఎల్​పీ సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సీఎం కుర్చీపై చర్చించే అవకాశం ఉంది.

మరి ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయమైతే.. సిద్ధరామయ్య, శివకుమార్​లలో ఎవరు సీఎం అవుతారు? లేదా మల్లిఖార్జున ఖర్గేకు సీఎం పీఠాన్ని ఇస్తారా? అన్న ప్రశ్నలకు కొన్ని గంటల్లో సమాధానాలు దొరికేస్తాయి.

తదుపరి వ్యాసం