తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Article 370 Verdict : ‘ఆర్టికల్​ 370 తాత్కాలికమే’- రద్దుపై సుప్రీం కీలక తీర్పు!

Article 370 verdict : ‘ఆర్టికల్​ 370 తాత్కాలికమే’- రద్దుపై సుప్రీం కీలక తీర్పు!

Sharath Chitturi HT Telugu

11 December 2023, 12:12 IST

    • Article 370 verdict LIVE Updates : ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఆర్టికల్​ 370 అనేది తాత్కాలిక సదుపాయమని, దానిని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. (PTI)

ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Article 370 verdict LIVE Updates : జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 70 రద్దుపై సోమవారం ఉదయం కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ఆర్టికల్​ 370 అనేది తాత్కాలికమే అని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. స్వయంప్రతిపత్తిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి రాజ్యాంగం ఇచ్చిందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

2019 ఆగస్ట్​లో జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసింది కేంద్రం. అనంతరం ఆ ప్రాంతాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ సమయంలో.. జమ్ముకశ్మీర్​లో అలజడులు నెలకొన్నాయి. అనంతరం.. కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. అనేక విపక్ష పార్టీలు సర్వోన్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వాటిపై గత కొంతకాలంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్​లో తీర్పును రిజర్వ్​లో పెట్టింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ బీఆర్​ గవాయ్​, జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ సంజీవ్​లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. తాజాగా తీర్పును వెల్లడించింది.

Supreme court Article 370 verdict :  "ఆర్టికల్​ 356 (రాష్ట్రపతి పాలన విధించడం) కింద కేంద్ర తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరు. అలాకాకుండా.. ప్రతిదీ సవాలు చేయగలిగితే.. గందరగోళం నెలకొంటుంది. అదే విధంగా.. రాష్ట్రపతి తన అధికారాల్ని ఉపయోగించుకుని, జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంలో తప్పు లేదని రాజ్యాగం చెబుతోంది. ఆర్టికల్​ 370 అనేది తాత్కాలిక సదుపాయం. ఆ ప్రాంతంలో నెలకొన్ని యుద్ధ పరిస్థితులతో ఆ తాత్కాలిక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. జమ్ముకశ్మీర్​కి ఉన్న అంతర్గత సార్వభౌమాధికారం విభిన్నమైనది కాదు," అని తీర్పును వెలువరించిన సమయంలో వ్యాఖ్యానించారు సీజేఐ జస్టిస్​ చంద్రచూడ్​.

అదే సమయంలో.. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్​కి వీలైనంత త్వరగా రాష్ట్ర హోదాను కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. 2024 సెప్టెంబర్​ 30లోపు.. ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.

కశ్మీర్​లో భద్రత కట్టుదిట్టం..

Article 370 verdict latest news : ఆర్టికల్​ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీనగర్​ సహా కశ్మీర్​ లోయలోని అనేక చోట్ల అదనపు భద్రతను మోహరించారు. మరోవైపు.. ఆ ప్రాంతంలోని రాజకీయ నేతలను గృహ నిర్బంధంలో ఉంచినట్టు వార్తలు వస్తున్నాయి. పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇంటికి పోలీసులు తాళం వేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదని జమ్ముకశ్మీర్​ ఎల్​జీ మనోజ్​ సిన్హా తెలిపారు.

తదుపరి వ్యాసం