జమ్ముకశ్మీర్లో తీవ్ర అలజడులు నెలకొన్నాయి. పుల్వామా జిల్లా పాంపోర్కు చెందిన సంబోరా గ్రామంలోని వరి పొలాల్లో ఎస్ఐ ఫరూక్ అహ్మద్ మీర్ మృతదేహం కనిపించింది. ఆయన శరీరం మొత్తం బుల్లెట్ గాయాలతో నిడిపోయింది.
శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఉగ్రవాదులే ఆ ఎస్ఐని చంపినట్టు తెలుస్తోంది.
"ఐఆర్పీ 23 బెటాలియన్లో పోస్ట్ అయిన ఫకూర్ అహ్మద్ మీర్ మృతదేహం.. ఆయన ఇంటికి సమీపంలోని వరి పొలాల్లో కనిపించింది. తన వరి పొలాల్లో పనిచేసేందుకు ఆయన ఇంటి నుంచి బయటకి వచ్చినట్టు తెలుస్తోంది. అప్పుడే ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నాము. ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది," అని కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.
జమ్ముకశ్మీర్లో ఇటీవలి కాలంలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. పోలీసులు, వ్యాపారులు, పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపుతున్న ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ క్రమంలో తాజా ఘటన.. సర్వత్రా భయాందోళనలను సృష్టించింది.
సంబంధిత కథనం