తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Malicious Apps Android : వెంటనే ఈ యాప్స్​ తొలగించండి- లేకపోతే..!

Malicious apps android : వెంటనే ఈ యాప్స్​ తొలగించండి- లేకపోతే..!

Sharath Chitturi HT Telugu

20 August 2022, 9:53 IST

    • Malicious apps android : మీ ఆండ్రాయిడ్​ ఫోన్​లలో ఈ యాప్స్​ ఉన్నాయా? అయితే తస్మాత్​ జాగ్రత్త.
ఆండ్రాయిజ్​ యూజర్స్​.. వెంటనే ఈ యాప్స్​ తెలగించండి!
ఆండ్రాయిజ్​ యూజర్స్​.. వెంటనే ఈ యాప్స్​ తెలగించండి! (Mint)

ఆండ్రాయిజ్​ యూజర్స్​.. వెంటనే ఈ యాప్స్​ తెలగించండి!

Malicious apps android : ఆండ్రాయిడ్​ వినియోగదారులకు అలర్ట్​! గూగుల్​ ప్లే స్టోర్​లో.. 35 మాల్వేర్​ యాప్​లను గుర్తించింది ఐటీ సెక్యూరిటీ రీసెర్చర్​ బిట్​డిఫెండర్​. వీటి వల్ల ఫోన్లకే ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి చూడటానికి సాధారణ యాప్స్​లాగే ఉన్నా.. ఒక్కసారి ఇన్​స్టాల్​ చేసుకున్న తర్వాత.. ఫోన్​ సెట్టింగ్స్​లో అనేక మార్పులు తీసుకొస్తాయని బిట్​డిఫెండర్​ పేర్కొంది. ఇప్పటికే ఈ యాప్​లకు 20లక్షలకుపైగా డౌన్​లోడ్​లు ఉండటం ఆందోళనకరం.

ఒక్కసారి డౌన్​లోడ్​ చేసిన తర్వాత.. ఈ యాప్​లు యూజర్లకు యాడ్స్​ చూపిస్తాయి. షార్ట్​కట్​లు క్రియేట్​ చేస్తాయి. వివిధ నోటిఫికేషన్లు తీసుకొస్తాయి. ఇతర యాప్​ల విండోస్​లను బ్లాక్​ చేస్తాయి. ఈ యాప్​లు.. వాటి పేర్లు, ఐకాన్​లను వాటంతట అవే మార్చుకోగలుగుతుండటం అత్యంత ఆందోళనకర విషయం. ఫలితంగా వీటిని గుర్తించడం కూడా కష్టంగానే ఉంటోంది.

వీటిల్లో పలు యాప్​లను గూగుల్​ ఇప్పటికే ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. కానీ ఇంకా ఇలాంటి యాప్​లు ఎన్నో.. ప్లే స్టోర్​లో ఉండటం, యూజర్లు డౌన్​లోడ్​ చేసుకుంటుండటం గమనార్హం.

ఈ 35 యాప్​లతో జాగ్రత్త..

  • వాల్​ లైట్​- వాల్​పేపర్స్​ ప్యాక్​
  • బిగ్​ ఎమోజీ- కీబోర్డ్​ 5.0
  • గ్రాండ్​ వాల్​పేపర్స్​- 3డీ బ్యాక్​డ్రాప్స్​ 2.0
  • ఇంజిన్​ వాల్​పేపర్స్​
  • స్టాక్​ వాల్​పేపర్స్​
  • ఎఫెక్ట్​మేనియా- ఫొటో ఎడిటర్​ 2.0
  • ఆర్ట్​ ఫిల్టర్​- డీప్​ ఫొటో ఎఫెక్ట్​ 2.0
  • ఫాస్ట్​ ఎమోజీ కీబోర్డ్​ ఏపీకే
  • క్రియేట్​ స్టికర్​ ఫర్​ వాట్సాప్​ 2.0
  • మాత్​ సాల్వర్​- కెమెరా హెల్పర్​ 2.0
  • ఫొటోపిక్స్​ ఎఫెక్ట్స్​- ఆర్ట్​ ఫిల్టర్​ 2.0
  • లెడ్​ థీమ్​- కలర్​ఫుల్​ కీబోర్డ్​ 2.0
  • యానిమేటెండ్​ స్టికర్​ మాస్టర్​ 1.0
  • స్లీప్​ సౌండ్​ 1.0
  • పర్సనాలిటీ ఛార్జింగ్​ షో 1.0
  • ఇమేజ్​ వ్రాప్​ కెమెరా
  • జీపీఎస్​ లొకేషన్​ ఫైండర్​

వీటిల్లో చాలా యాప్​లకు లక్షకుపైగా డౌన్​లోడ్​లు ఉన్నాయి. ఇన్ని డౌన్​లోడ్​లు ఉండేసరికి.. మంచి యాప్​ అనుకుని ఇతరులు డౌన్​లోడ్​ చేసుకుంటున్నారు. కానీ ఇవి అత్యంత ప్రమాదకరం!

ఆండ్రాయిడ్​ ఫోన్​ను ఎలా కాపాడుకోవాలి?

Android phones security: కొన్ని చర్యలు తీసుకుంటే.. ఇలాంటి యాప్​ల నుంచి ఫోన్​ను కాపాడుకోవచ్చు.

  • డౌన్​లోడ్​ చేసే ముందు యాప్​ పర్మీషన్లను చూడండి.
  • యాప్​కు ఉన్న యూజర్​ రేటింగ్​ను పరిశీలించండి.
  • ఆండ్రాయిడ్​ సాఫ్ట్​వేర్​ను ఎప్పటికప్పుడు అప్డేట్​ చేస్తూ ఉండండి.

తదుపరి వ్యాసం