తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sri Lanka Crisis : అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు పిలుపు

Sri Lanka Crisis : అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు పిలుపు

Sharath Chitturi HT Telugu

30 July 2022, 10:20 IST

google News
  • Sri Lanka Crisis : సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకునేందుకు.. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంట్​ సభ్యులకు పిలుపునిచ్చారు ఆ దేశాధ్యక్షుడు విక్రమసింఘే. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వివరించారు.

పెట్రోల్​ కోసం శ్రీలంక ప్రజల నిరీక్షణ
పెట్రోల్​ కోసం శ్రీలంక ప్రజల నిరీక్షణ (REUTERS)

పెట్రోల్​ కోసం శ్రీలంక ప్రజల నిరీక్షణ

Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం వేళ పార్లమెంట్​ సభ్యులకు లేఖ రాశారు ఆ దేశాధ్యక్షుడు రణిల్​ విక్రమసింఘే. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు.

శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని, అయితే.. అన్ని పార్టీల సభ్యులు, పౌర సమాజం, విద్యాసంస్థల సహాయం లేకపోతే అది జరగదని రణిల్​ విక్రమసింఘే అభిప్రాయపడ్డారు. శ్రీలంక రాజ్యాంగంలో 19వ సవరణను తిరిగి తీసుకొచ్చే విషయంపై చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.

"శ్రీలంకలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. రాజకీయం, సమాజానికి చెందిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని భావిస్తున్నాను," అని పార్లమెంట్​ సభ్యులకు శుక్రవారం రాసిన లేఖలో విక్రమసింఘే పేర్కొన్నారు.

అధ్యక్షుడి అధికారాలను తగ్గించి పార్లమెంట్​కు అధిక పవర్​ని ఇస్తూ.. 2015లో 19ఏ చట్టం అమల్లోకి వచ్చింది. కాగా.. 2019 ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన అనంతరం.. 19ఏని పూర్తిగా తీసేశారు గొటబాయ రాజపక్స.

శ్రీలంక సంక్షోభం వేళ విక్రమసింఘేపై ఆ దేశ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. రాజపక్స రాజీనామాతో.. ఈనెల 20న అప్పటి ప్రధాని విక్రమసింఘేను ఎంపీలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం