తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral | శునకాన్ని కొరికేసిన మహిళ.. అదే కారణం..!

Viral | శునకాన్ని కొరికేసిన మహిళ.. అదే కారణం..!

HT Telugu Desk HT Telugu

02 April 2022, 22:19 IST

    • కుక్కలు మనిషిని కరిచిన ఘటనల గురించి తరచూ వింటూనే ఉంటాము. కానీ శునకాన్ని ఓ మహిళ కరవడం గురించి ఎప్పుడైనా విన్నారా? అమెరికాలో ఇదే జరిగింది..
పిట్​బుల్​
పిట్​బుల్​ (Google)

పిట్​బుల్​

Woman bites dog | ఓ పిట్​బుల్​ డాగ్​ను ఓ మహిళ కొరికిన ఘటన అమెరికా ఒహియోలో చోటుచేసుకుంది. తన పెంపుడు శునకాన్ని కరవడానికి వచ్చిన పిట్​బుల్​ చెవిని ఆమె గట్టిగా కొరికేసింది.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

మార్చ్​ 28న జరిగింది ఈ ఘటన. జెన్నిఫర్​ ఓ జంతు ప్రేమికురాలు. తన వద్ద రెండు శునకాలు ఉన్నాయి. అందులో కెవిన్​(ఎస్కిమో పొమరేనియన్​ మిక్స్​) ఒకటి. ఆరోజు.. ఉద్యోగానికి వెళ్లేముందు.. తన కుక్కలను ఇంటి వెనకాల విడిచిపెట్టింది. కొద్దిసేపటికి.. ఓ పిట్​బుల్​ వాటిపై దాడి చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది.

అది చూసిన జెన్నిఫర్​.. చాలా భయపడిపోయింది. ఎలాగైనా తన శునకాలను కాపాడాలి అని అనుకుంది.

"నేను ఉండగా నా శునకానికి ఎలాంటి హానీ జరగకూడదని భావించాను. నా ముందు నా శునకాన్ని ఎవరూ ఏం చేయలేరు," అని జెన్నిఫర్​ అనుకుంది.

అప్పుడే.. తన పెంపుడు శునకానికి, పిట్​బుల్​కి మధ్యలో తన శరీరాన్ని అడ్డుపెట్టింది. కానీ ఆ ప్రయత్నం పెద్దగా ఫలించ లేదు. ఇక వేరే మార్గం లేక.. పిట్​బుల్​కు కొరికేసింది జెన్నిఫర్​.

"ఏదైనా చేసి.. దాడి నుంచి నా శునకాన్ని రక్షించాలని అనుకున్నా. పిట్​బుల్​ చెవి.. నాకు దగ్గర్లో ఉంది. వెంటనే కొరికేశా. నా శక్తినంతా ఉపయోగించి పిట్​బుల్​ చెవిని కొరికాను," అని జెన్నిఫర్​ చెప్పుకొచ్చింది.

ఆ పిట్​బుల్​పై జెన్నిఫర్​ పంటి గాట్లు బలంగా పడ్డాయి. నొప్పితో పిట్​బుల్​ గట్టిగా అరిచింది. ఈ క్రమంలోనే అటుగా వెళుతున్న వ్యక్తి.. ఆ పిట్​బుల్​ను పక్కకి లాగేశాడు.

42ఏళ్ల విలియమ్​ డెంప్​సే.. ఆ పిట్​బుల్​ యజమాని అని తెలిసింది. ఆ పిట్​బుల్​ను విడిచిపెట్టకూడదని ట్రంబుల్​ కౌంటీ షెరీఫ్​ అధికారులు ఆమెకు హెచ్చరికలు ఇచ్చినట్టు సమాచారం.

టాపిక్

తదుపరి వ్యాసం