తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అజిత్ పవార్ వర్గానికే ఎన్సీపీ పేరు, గుర్తు.. శరద్ పవార్ శిబిరం ఇప్పుడేం చేయనుంది

అజిత్ పవార్ వర్గానికే ఎన్సీపీ పేరు, గుర్తు.. శరద్ పవార్ శిబిరం ఇప్పుడేం చేయనుంది

HT Telugu Desk HT Telugu

06 February 2024, 20:54 IST

google News
    • అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం ఎన్సీపీ పేరు, గుర్తును పొందడం రాబోయే ఎన్నికలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఎన్‌సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్
ఎన్‌సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ (ANI)

ఎన్‌సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్

కీలకమైన లోక్ సభ, రాజ్యసభ ఎన్నికలకు ముందు ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ వర్గమే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తేల్చిచెప్పింది. గ్రూపు తగాదాలపై నెలల తరబడి సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎన్నికల సంఘం ఎన్సీపీ గుర్తు 'వాల్ క్లాక్'ను అజిత్ పవార్ నేతృత్వంలోని బృందానికి కేటాయించింది.

పార్టీ రాజ్యాంగానికి, సంస్థాగత ఎన్నికలకు అతీతంగా రెండు గ్రూపులు పనిచేస్తున్నాయని తేలిన ఈ సందర్భంలో శాసనసభా విభాగంలో మెజారిటీ పరీక్ష అనుకూలంగా ఉందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.

అజిత్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ప్రకటించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఒత్తిడితోనే జరిగిందని శరద్ పవార్ నేతృత్వంలోని బృందం నేత ఒకరు ఆరోపించారు. ‘ఇది ప్రజాస్వామ్య హత్య. దురదృష్టకరం' అని మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. పైనుంచి వచ్చిన ఒత్తిడితోనే ఎన్నికల సంఘం ఈ తీర్పు ఇచ్చిందని దేశ్‌ముఖ్ ఓ టీవీ చానెల్‌తో అన్నారు.

శరద్ పవార్ వర్గం ఏం చేయనుంది?

తన మేనల్లుడు అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గానికి ఎన్సీపీ గుర్తు 'వాల్ క్లాక్'ను కోల్పోవడంతో శరద్ పవార్ వర్గం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర నుంచి రాజ్యసభలో ఆరు స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో కొత్త రాజకీయ సంస్థను ఏర్పాటు చేసి మూడు ప్రాధాన్యతలను సమర్పించడానికి ఈ వర్గానికి ఒక ఆప్షన్‌ను ఎన్నికల సంఘం కల్పించింది.

కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా శరద్ పవార్ వర్గం రాజకీయ పార్టీ ఏర్పాటుకు తాము ఎంచుకున్న కొత్త పేరును సమర్పించి, రాజ్యసభ స్థానాలకు తమ ప్రాధాన్యతలను అందించాలి. అలా చేయడంలో విఫలమైతే శరద్ పవార్ వర్గంతో జతకట్టిన ఎమ్మెల్యేలను ఎన్నికల ప్రవర్తనా నియమావళి, 1961లోని రూల్ 39ఏఏ ప్రయోజనం కోసం స్వతంత్రులుగా పరిగణిస్తారు.

(పీటీఐ ఇన్ పుట్స్ తో)

తదుపరి వ్యాసం