తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Jodo Yatra Day 5: పాఠశాలలో రాత్రి బస చేయనున్న రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra day 5: పాఠశాలలో రాత్రి బస చేయనున్న రాహుల్ గాంధీ

HT Telugu Desk HT Telugu

11 September 2022, 16:44 IST

google News
    • Bharat Jodo Yatra day 5: యూనివర్శిటీలో ప్రత్యేక వాహనాలతో శిబిరం ఏర్పాటు చేయడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు వ్యతిరేకించడంతో రాహుల్ గాంధీ నేడు పాఠశాలలో బస చేయనున్నారు.
పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, శశి థరూర్, వీడీ సతీషన్ తదితరులతో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తున్న రాహుల్ గాంధీ
పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, శశి థరూర్, వీడీ సతీషన్ తదితరులతో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తున్న రాహుల్ గాంధీ (Congress Twitter)

పార్టీ నేతలు కేసీ వేణుగోపాల్, శశి థరూర్, వీడీ సతీషన్ తదితరులతో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తున్న రాహుల్ గాంధీ

తిరువనంతపురం, సెప్టెంబర్ 11: కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం రాత్రి తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో బస చేయనున్నారు.

తిరువనంతపురంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంటైనర్ల (బస కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలు) శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి అనుమతి కూడా మంజూరైందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే చివరి నిమిషంలో, కేరళ సీపీఎం విద్యార్థి విభాగం, విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం దీనికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చాయి.

దీంతో యాత్రను వివాదాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నామని, కాబట్టి కంటైనర్లకు బదులుగా, రాహుల్ గాంధీతో సహా పార్టీ నాయకులు ఆదివారం రాత్రి పాఠశాలలో బస చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఐదో రోజుకు చేరుకుంది. పాదయాత్ర ఆదివారం కేరళకు చేరుకుంది. కాంగ్రెస్ నేతలు కేరళ, తమిళనాడు సరిహద్దులో ఉన్న చిన్న పట్టణమైన పరశాలకు చేరుకున్నారు.

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర 150 రోజుల్లో పూర్తవుతుంది. మొత్తంగా 12 రాష్ట్రాలను కవర్ చేస్తుంది.

కేరళ నుండి యాత్ర తదుపరి 18 రోజుల పాటు రాష్ట్రం గుండా ప్రయాణించి, సెప్టెంబర్ 30న కర్నాటకకు చేరుకుంటుంది. 21 రోజుల పాటు కర్ణాటకలో సాగుతుంది.

బీజేపీ విభజన రాజకీయాలను ఎదుర్కోవడానికి, ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, రాజకీయ కేంద్రీకరణ ప్రమాదాల నుండి దేశ ప్రజలను మేల్కొల్పడానికి 'భారత్ జోడో యాత్ర' నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.

యాత్రలో భాగంగా బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోంది. వీటిలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు.

రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు అందరూ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. కొన్ని కంటైనర్లలో స్లీపింగ్ బెడ్‌లు, టాయిలెట్లు, ఏసీలు కూడా ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. రాబోయే ఎన్నికల్లో పోరాడేందుకు పార్టీ శ్రేణులను సమీకరించే ప్రయత్నంగా ఈ యాత్రను విశ్లేషిస్తున్నారు.

తదుపరి వ్యాసం