Calcutta High Court : ‘అమ్మాయిలు లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవాలి- అబ్బాయిలు అలా చేయాలి'
01 October 2024, 12:04 IST
- Calcutta High Court : మైనర్‌పై జరిగిన రేప్ కేసు విచారణలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది కోల్‌కతా హైకోర్టు. అమ్మాయిలు తమ లైంగిక కోరికలను తగ్గించుకోవాలని వ్యాఖ్యానించింది. అబ్బాయులు.. అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలని పేర్కొంది.
‘అమ్మాయిలు సెక్స్ కోరికలను తగ్గించుకోవాలి.. అబ్బాయిలు అలా చేయాలి'
Calcutta High Court : యుక్తవయస్సులోని అమ్మాయిలు.. వారి లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవాలని వ్యాఖ్యానించింది కోల్‌కతా హైకోర్టు. అదే సమయంలో యుక్తవయస్సులోని అబ్బాయిలు.. అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఓ మైనర్ బాలికకు సంబంధించిన రేప్ కేసు విచారణలో భాగంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సంబంధిత బాలికతో రొమాంటిక్ రిలేషన్లో ఉన్న నిందితుడిని నిర్దోషిగా తేల్చుతూ తీర్పును వెలువరించింది.
'లైంగిక కొరికలు తగ్గించుకోండి..'
"2 నిమిషాల సంతోషం కోసం పరుగులు తీయకుండా.. అమ్మయిలు వారి లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. యుక్తవయస్సులోని అబ్బాయిలు, అమ్మాయిలకు, మహిళలకు గౌరవ ఇవ్వాలి," అని జస్టిస్ చిత్త రంజన్ దాశ్, జస్టిస్ పార్థ సారథి సేన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Calcutta High Court latest news : "మనిషిలోని టెస్టోస్టీరాన్.. లైంగిక కోరికలకు మూల కారణం. ఈ టెస్టోస్టీరాన్‌ను హైపోథలామస్, పిట్యుటరీ గ్లాండ్లు కంట్రోల్ చేస్తాయి. సెక్స్ కోరికలకు ఇదే కారణం. ఇది అందరి శరీరాల్లోనూ ఉంటుంది. ఈ గ్లాండ్లు యాక్టివ్ అయితే.. కోరికలు పుడతాయి. అయితే ఇవి ఆటోమెటిక్‌గా జరిగిపోదు. ఇది అందరు గుర్తించాలి," అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో అమ్మాయిలు.. లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవడంతో పాటు తమ సమగ్రత, గౌరవం, విలువలను రక్షించుకోవాలని కోల్‌కతా హైకోర్టు అభిప్రాయపడింది. ప్రైవసీకి పెద్ద పీట వేయాలని సూచించింది.
"ఇక అబ్బాయిల విషయానికొస్తే.. మహిళలు, అమ్మాయిలకు గౌరవం ఇవ్వడం వారి బాధ్యత. మహిళలకు విలువ నిచ్చే విధంగా అబ్బాయిలు వారి మెదడును ట్రైన్ చేసుకోవాలి. అమ్మాయిల ప్రైవసీకి వాల్యూ ఇవ్వాలి," అని హైకోర్టు సూచించింది.
Sexual feelings in girls : దేశంలో ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీరిలో చాలా మంది మైనర్లే ఉంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో రొమాంటిక్ రిలేషన్ అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.