NCRB Data | రోజుకు 86.. ఏడాదికి 31 వేల పైనే.. మహిళలపై అత్యాచారాలు
NCRB Data on rapes| భారతదేశంలో మహిళలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులు, హత్యలు.. దేశంలో జరుగుతున్న మెజారిటీ నేరాలకు మహిళలే ఈజీ టార్గెట్ అనిపిస్తోంది.
NCRB Data on rapes |దేశంలో జరుగుతున్న నేరాలపై ఎన్‌సీఆర్‌బీ (National Crime Records Bureau- NCRB) ఏటా ఒక నివేదిక రూపొందిస్తుంది. అందులో భాగంగా 2021, 2020, 2019 సంవత్సరాల్లో జరిగిన నేరాలను క్రోడీకరించి ఒక నివేదికను ఎన్‌సీఆర్‌బీ విడుదల చేసింది. అంటే ఇవి అధికారికంగా నమోదైన వివరాలు మాత్రమే. లెక్కకు అందని నేరాల సంఖ్య భారీగానే ఉంటుంది.
NCRB Data on rapes | మహిళలే బాధితులు..
NCRB తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో మహిళలపై రోజుకుసగటున 86 అత్యాచారాలు జరుగుతున్నాయి. గంటకు మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య 49 అని ఆ నివేదిక తేల్చింది. NCRB కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. మొత్తంగా 2021లో మహిళలపై 31,677 అత్యాచారాలు జరిగాయి. అంటే సగటున రోజుకు 86. అలాగే, ప్రతీ గంటకు మహిళ లక్ష్యంగా జరిగిన నేరాల సంఖ్య 49.
NCRB Data on rapes | 2020లో..
2020 సంవత్సరానికి వస్తే.. ఆ ఏడాది మహిళలపై జరిగిన అత్యాచారాల సంఖ్య 28046. ఆ సంవత్సరం దేశమంతా చాలా కాలం లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ మహిళలపై అత్యాచారాలు పెద్దగా తగ్గలేదు. 2021 కన్నా 2020లోనే రేప్‌ల సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది. అలాగే, 2019లో జరిగిన అత్యాచారాల సంఖ్య 32,033.
NCRB Data on rapes | రాష్ట్రాల వారీగా..
2021లో రాష్ట్రాల వారీగా తీసుకుంటే మహిళలపై అత్యాచారాల విషయంలో రాజస్తాన్ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 2021లో 6,337 రేప్‌లు జరిగాయి. తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్(2,947), ఉత్తరప్రదేశ్(2845) ఉన్నాయి. అతి తక్కువ రేప్‌లతో ఢిల్లీ మహిళలకు కొంత సేఫ్ ప్లేస్‌గా నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో 2021లో 1250 అత్యాచారాలు జరిగాయి.
NCRB Data on rapes | క్రైమ్ రేటు పరంగా..
మహిళలపై జరిగిన అత్యాచారాల క్రైమ్ రేటు విషయంలోనూ రాజస్తానే ముందుంది. ఆ రాష్ట్రంలో ఒక లక్ష జనాభాకు రేప్ క్రైమ్ 16.4%, చండీగఢ్‌లో 13.3%, ఢిల్లీలో 12.9%, హరియాణాలో 12.3% క్రైమ్ రేట్ ఉందని NCRB వెల్లడించింది. ఈ విషయంలో జాతీయ సగటు 4.8%. మొత్తంగా 2021 సంవత్సరంలో మహిళలపై 4,28,278 నేరాలు జరిగాయి. అంటే ఇవి అధికారికంగా నమోదైన వివరాలు మాత్రమే. లెక్కకు అందని నేరాల సంఖ్య భారీగానే ఉంటుంది. మొత్తంగా మహిళలపై నేరాల రేటు(లక్ష జనాభాకు) 64.5%. 2020లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 3,71,503. 2019లో ఇది 4,05,326. మహిళలపై జరిగిన నేరాల్లో ప్రధానమైనవి అత్యాచారం, హత్యాచారం, కిడ్నాప్, యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, బలవంతపు పెళ్లి, అక్రమ రవాణా, ఆన్‌లైన్ వేధింపులు.. మొదలైనవి ఉన్నాయి.