తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cat 2023 Admit Cards: క్యాట్ 2023 అడ్మిట్ కార్డ్స్ విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

CAT 2023 Admit cards: క్యాట్ 2023 అడ్మిట్ కార్డ్స్ విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

07 November 2023, 18:51 IST

google News
  • CAT Admit cards: ప్రఖ్యాత మేనేజ్మెంట్ విద్యా సంస్థలైన ఐఐఎంలలో అడ్మిషన్ల కోసం నిర్వహించే క్యాట్ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ విడుదల అయ్యాయి. వాటిని క్యాట్ 2023 (CAT 2023) కి అప్లై చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 7వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CAT Admit cards: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) లక్నో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2023) అడ్మిట్ కార్డ్‌ లను ఈరోజు, నవంబర్ 7న విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డ్‌లు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో అందుబాటులో ఉన్నాయి. అడ్మిట్ కార్డ్స్ ను డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ లను ఉపయోగించాలి. ప్రఖ్యాత మేనేజ్మెంట్ విద్యా సంస్థలైన ఐఐఎం(Indian Institute of Management IIM) లలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఐఐఎం లక్నో..

ఈ సంవత్సరం క్యాట్ పరీక్ష (CAT 2023) ను ఐఐఎం లక్నో నిర్వహిస్తోంది. క్యాట్ 2023 అడ్మిట్ కార్డ్స్ ను మొదట అక్టోబర్ 25వ తేదీన విడుదల చేస్తామని ఐఐఎం లక్నో ప్రకటించింది. కానీ, సాంకేతిక కారణాలతో ఆ తేదీని వాయిదా వేసింది. తాజాగా, తమ అధికారిక వెబ్ సైట్ లో ఈ అడ్మిట్ కార్డ్స్ ను అప్ లోడ్ చేసింది. "CAT 2023 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ iimcat.ac.in వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయబడి ఉన్నాయి. యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ లను ఉపయోగించి అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు’’ ఐఐఎం లక్నో ఒక ప్రకటనలో తెలిపింది.

How to download: ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

  • క్యాట్ 2023 అడ్మిట్ కార్డ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
  • ముందుగా అధికారిక వెబ్ సైట్ iimcat.ac.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే IIM CAT 2023 admit card download లింక్ పై క్లిక్ చేయాలి.
  • యూజర్ ఐడీ, పాస్ వర్డ్ లను ఎంటర్ చేయాలి.
  • స్క్రీన్ పై మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
  • వివరాలు సరి చూసుకుని అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి.
  • ఎగ్జామ్ రోజు చూపించడానికి ఒక ప్రింట్ ఔట్ తీసి భద్రపర్చుకోండి.
  • క్యాట్ 2023 పరీక్షను ఈ నవంబర్ 26వ తేదీన నిర్వహిస్తారు.
  • అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత విద్యార్థులు దానిపై ఉన్న సూచనలను చదవాలి.
  • ఎగ్జామ్ హాళ్లోకి వెళ్లాల్సిన సమయం, తీసుకువెళ్లాల్సిన వస్తువుల లిస్ట్, తీసుకువెళ్లకూడని వస్తువుల లిస్ట్ ను గుర్తుంచుకోవాలి.
  • క్యాట్ 2023 లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ తరువాత ఆయా ఐఐఎంలు నిర్వహించే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. ఆ తరువాతే అడ్మిషన్ లభిస్తుంది.

తదుపరి వ్యాసం