CAT 2023: ‘క్యాట్ 2023’ కు అప్లై చేశారా? రేపే లాస్ట్ డేట్..-cat 2023 registration ends tomorrow on iimcatacin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Cat 2023 Registration Ends Tomorrow On Iimcat.ac.in

CAT 2023: ‘క్యాట్ 2023’ కు అప్లై చేశారా? రేపే లాస్ట్ డేట్..

HT Telugu Desk HT Telugu
Sep 12, 2023 03:32 PM IST

CAT 2023: ప్రముఖ మేనేజ్మెంట్ కళాశాలలైన ఐఐఎంలలో ఎంబీఏ అడ్మిషన్ల కోసం నిర్వహించే క్యాట్ (CAT 2023) పరీక్షకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 13.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

CAT 2023: ప్రసిద్ధ మేనేజ్మెంట్ కాలేజీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కోసం ప్రతీ సంవత్సరం కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) ను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం క్యాట్ పరీక్ష (CAT 2023) కు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిసిప్లిన్ లో డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

రేపే లాస్ట్ డేట్..

క్యాట్ పరీక్షకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 13. ఈ లోపు ఏదైనా డిసిప్లిన్ లో డిగ్రీ పూర్తయిన అభ్యర్థులు క్యాట్ నిర్వహణకు సంబంధించిన అధికారిక వెబ్ సైట్ iimcat.ac.in ద్వారా ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఐఐఎం లక్నో (IIM Lucknow) ఈ క్యాట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. క్యాట్ 2023 పరీక్షకు హాల్ టికెట్స్ ఈ సంవత్సరం అక్టోబర్ 25వ తేదీనుంచి అందుబాటులో ఉంటాయి. క్యాట్ 2023 పరీక్ష నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా మూడు షిఫ్ట్ ల్లో 155 పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది.

అర్హతలివే..

క్యాట్ 2023 పరీక్షకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఏదైనా డిసిప్లిన్ లో కనీసం 50% మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కేటగిరీల అభ్యర్థులు కనీసం 45% మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క్యాట్ 2023 కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు రూ. 2400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 1200. క్యాట్ 2023 పరీక్ష ఫలితాలు 2024 జనవరి రెండో వారంలో వెలువడే అవకాశముంది. క్యాట్ 2023 స్కోర్స్ డిసెంబర్ 31, 2024 వరకు వ్యాలిడ్ గా ఉంటాయి. క్యాట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులు తాము కోరుకున్న విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. క్యాట్ పరీక్ష ద్వారా చేసే అడ్మిషన్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ విధానం లేదు.

WhatsApp channel
తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.