CAT 2023 notification : క్యాట్ 2023 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
CAT 2023 notification : క్యాట్ 2023 నోటిఫికేషన్‌ను తాజాగా ప్రకటించింది ఐఐఎం లక్నో. రిజిస్ట్రేషన్‌తో పాటు ఎగ్జామ్ డేట్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
CAT 2023 notification : కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2023కి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. iimcat.ac.in లో అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్లో.. రిజిస్ట్రేషన్, ఎగ్జామ్ తేదీలతో పాటు ఇతర వివరాలను వెల్లడించింది ఐఐఎం లక్నో. పూర్తి వివరాల్లోకి వెళితే..
ముఖ్యమైన తేదీలు..
రిజిస్ట్రేషన్ మొదలయ్యే తేది:- ఆగస్టు 2 ఉదయం 10 గంటలు
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే తేదీ:- సెప్టెంబర్ 13 సాయంత్రం 5 గంటలు
అడ్మిట్ కార్డు విడుదల చేసే తేదీ:- అక్టోబర్ 25
CAT 2023 registration : పరీక్ష నిర్వహించే తేదీ:- నవంబర్ 26
ఫలితాలు ప్రకటించే తేదీ:- 2024 జనవరి రెండో వారం (అంచనా)
అప్లికేషన్ ఫీజు:- ఓసీలకు రూ. 2,400. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 1,200.
ఎలిజెబులిటీ:- బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50శాతం పర్సెంటేజ్ లేదా అందుకు సమానమైన సీజీపీఏ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 45శాతం సరిపోతుంది) ఉన్న అభ్యర్థులు క్యాట్ 2023 పరీక్షకు హాజరవ్వచ్చు.
ఇదీ చూడండి:- JIMPER recruitment 2023: జిప్మర్ లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
CAT 2023 exam date : బీ స్కూల్స్‌లో అడ్మిషన్ తీసుకుని ఎంబీఏ కోర్సులు చదువుదామని భావిస్తున్న అభ్యర్థులకు ఈ క్యాట్ స్కోర్ చాలా కీలకం. దీనిని పరిగణలోకి తీసుకునే.. ఐఐఎంలు సీట్లను కేటాయిస్తాయి. అయితే.. క్యాట్‌లో క్వాలిఫై అయినంత మాత్రనా సీట్ వచ్చేస్తుందని ఏం లేదు! క్యాట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ, అనేక ఐఐఎంలు.. సొంతంగా అడ్మిషన్ రౌండ్స్ నిర్వహిస్తుంటాయి. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు వంటివి ఉంటాయి. ఇవన్నీ పాస్ అయితేనే సీటు లభిస్తుంది.
ఐఐఎం లక్నో ఈసారి పరీక్షను నిర్వహిస్తోంది. కాగా.. క్యాట్ 2022ను ఐఐఎం బెంగళూరు నిర్వహించింది. ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. సెప్టెంబర్ 21న ముగిసింది. నవంబర్‌లో పరీక్ష జరిగింది.
CAT 2023 syllabus : వర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రిహెన్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వంటివి ఈ క్యాట్ పరీక్షకు సిలబస్‌గా ఉంటాయి.
సంబంధిత కథనం