అదానీ చేతికి కోహినూర్.. ఫుడ్ బిజినెస్‌లో అగ్రస్థానానికి పరుగులు
03 May 2022, 14:13 IST
‘కోహినూర్’ సహా పలు బ్రాండ్లను చేజిక్కించుకున్న అదానీ విల్మార్ ఫుడ్ బిజినెస్ మరింత విస్తరించే పనిలో పడింది.
ఫార్చూన్ బ్రాండ్‌తో ఫుడ్ బిజినెస్‌లో ఉన్న అదానీ విల్మార్
ముంబయి, మే 3: ఫుడ్ బిజినెస్‌లో అగ్రస్థానం సాధించే దిశగా మెక్‌కార్మిక్ స్విట్జర్లాండ్ జీఎంబీహెచ్ నుంచి ప్రఖ్యాత 'కోహినూర్' బ్రాండ్‌తో సహా పలు బ్రాండ్‌లను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ విల్మార్ లిమిటెడ్ (ఎడబ్ల్యూఎల్) మంగళవారం ప్రకటించింది. అయితే సంబంధిత డీల్ పరిమాణం వెల్లడించలేదు.
ఈ కొనుగోలు ద్వారా భారతదేశంలో కోహినూర్ బ్రాండ్ గొడుగు కింద 'రెడీ టు కుక్', 'రెడీ టు ఈట్' కర్రీస్, మీల్స్ పోర్ట్‌ఫోలియోతో పాటు 'కోహినూర్' బ్రాండ్ బాస్మతి రైస్‌పై అదానీ విల్మార్‌కు ప్రత్యేక హక్కులు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
కోహినూర్ బ్రాండ్ దక్కించుకోవడం వల్ల బ్రాండ్ విలువ పెంచుకోవడంతో పాటు ఉత్పత్తులను పెంచుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ కొనుగోలుతో అదానీ విల్మార్ ఫుడ్ బిజినెస్‌లొ మరో మెట్టు పైకెక్కినట్టుగా భావిస్తున్నారు. బియ్యం, ఇతర విలువ ఆధారిత ఆహార వ్యాపారాలలో అదానీ విల్మార్ తన పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేస్తుంది.
కోహినూర్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం బాస్మతి బియ్యం 'కోహినూర్’, సరసమైన బియ్యం 'చార్మినార్', హొరెకా (హోటల్, రెస్టారెంట్ మరియు కేఫ్) విభాగానికి అవసరమైన 'ట్రోఫీ' బ్రాండ్లు ఉన్నాయి.
‘కోహినూర్ బ్రాండ్‌ను ఫార్చ్యూన్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం. కోహినూర్ బ్రాండ్ బలమైన బ్రాండ్ రీకాల్‌ను కలిగి ఉంది. ఫుడ్ ఎఫ్‌ఎమ్‌సిజి విభాగంలో మేం బలంగా ఎదగడంలో సహకరిస్తుంది.." అని అదానీ విల్మార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ అంగ్షు మల్లిక్ అన్నారు.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో అదానీ విల్మార్ ఏకీకృత నికర లాభంలో 26 శాతం క్షీణతతో రూ. 234.29 కోట్లుగా నమోదైంది. అధిక పన్ను ఖర్చుల కారణంగా నికరలాభం తగ్గింది. అదానీ విల్మార్.. అదానీ గ్రూప్, అలాగే సింగపూర్‌కు చెందిన విల్మార్ మధ్య 50:50 జాయింట్ వెంచర్.
టాపిక్