Metro train: మెట్రో రైలు ముందు దూకిన వ్యక్తి; మెట్రో సర్వీసులకు అంతరాయం
17 September 2024, 16:02 IST
మంగళవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి మెట్రో రైలు ముందు పట్టాలపై దూకాడు. అతడిని వెంటనే కాపాడారు. ఈ ఘటన కారణంగా మెట్రో సేవలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ప్రాణనష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని మెట్రో అధికారులు తెలిపారు.
మెట్రో రైలు ముందు దూకిన వ్యక్తి
బిహార్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం బెంగళూరులోని జ్ఞానభారతి స్టేషన్ వద్ద రైలు సమీపిస్తున్న సమయంలో మెట్రో పట్టాలపైకి దూకాడు. మధ్యాహ్నం 2.13 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎమర్జెన్సీ ట్రిప్ సిస్టం (ETS)ను ఉపయోగించిన స్టేషన్ కంట్రోలర్, రెస్క్యూ టీం వెంటనే సిద్ధార్థ్ అనే ఆ వ్యక్తిని రక్షించారు.
పర్పుల్ లైన్ లో అంతరాయం
ఈ ఘటనలో మెట్రో రైలు ముందు దూకిన సిద్ధార్థ్ అనే 30 ఏళ్ల వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని మెట్రో అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా మెట్రో సేవలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన వల్ల బెంగళూరు మెట్రో లోని పర్పుల్ లైన్ లో కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే పరిస్థితిని చక్కదిద్దిన అధికారులు ఈ లైన్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు మళ్లీ సాధారణ మెట్రో కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ సమయంలో బెంగళూరు (BENGALURU) లోని చల్లఘట్ట మెట్రో స్టేషన్ కు బదులుగా మైసూరు రోడ్డు మధ్య షార్ట్ లూప్ లో రెండు రైళ్లను నడిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.