No Work Job | ఏ పని చేయకపోవడమే ఈయన జాబ్.. మీకూ కావాలా ఆ జాబ్?
06 September 2022, 21:36 IST
No Work Job | ఈ ఉద్యోగం గురించి తెలిస్తే కచ్చితంగా జెలసీ ఫీల్ అవుతారు. అలాంటి జాబ్ మనకీ ఉంటే హ్యాపీ కదా అనుకుంటారు. ఏ పని చేయకపోవడమే ఈ జాబ్ లో చేయాల్సిన పని. ఆశ్చర్యంగా ఉందా? చదివేయండి మరి..
క్లయింట్ అరుణతో షోజి మొరిమొటొ
No Work Job | జపాన్ లో షోజి మొరిమొటొ అనే 30 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు. ఆయన చేసే ఉద్యోగం ప్రపంచంలోనే అత్యంత స్పెషల్ జాబ్. ఈ జాబ్ చేయడానికి పెద్దగా స్కిల్స్ అవసరం లేదు.. పెద్దగా కాదు.. నిజానికి అసలు స్కిల్స్ అనేవే అవసరం లేదు. ఏం చేయకుండా, కామ్ గా ఉంటే చాలు. అదే ఈ జాబ్ కు రిక్వైర్ మెంట్. మళ్లీ ఇదొక సెల్ఫ్ ఎంప్లాయిమెంటే. అంటే, ఇష్టం ఉంటే చేయొచ్చు.. ఇష్టం లేకపోతే చేయకుండా ఉండొచ్చు.
No Work Job | అసలేంటి ఈ జాబ్..
జపాన్ లో ఉండే షోజి మొరిమొటొ మొదట ఒక పబ్లిషింగ్ కంపెనీ లో పని చేసేవాడు. అయితే, సరిగ్గా పని చేయడం లేదని అతడిని ఆ జాబ్ నుంచి తొలగించారు. దాంతో, సొంతంగా ఈ పని వెతుక్కున్నాడు. ఈ జాబ్ లో తను చేయాల్సిందల్లా.. తనను హైర్ చేసుకున్న క్లయింట్ పక్కన ఉండడమే. ఆ క్లయింట్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లాలి. జస్ట్ క్లయింట్ కు తోడుగా ఉండాలి. అంతే. వేరే పనులు కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి జాబ్స్ కు జపాన్ లో మంచి గిరాకీ ఉందట. ముఖ్యంగా, కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు తనను డిస్ట్రబ్ చేయని తోడు కోసం చాలా మంది చూస్తున్నారట.
No Work Job | ఒక్కో అపాయింట్ మెంట్ కు దాాదాపు రూ. 6 వేలు
ఈ ఉద్యోగంలో ఒక్కో అపాయింట్ మెంట్ కు షోజి మొరిమొటొ మన కరెన్సీలో దాదాపు రూ. 6 వేలు(10 వేల యెన్లు) వసూలు చేస్తాడు. టిప్స్ అదనం. ఫుడ్, ట్రావెల్, అకామిడేషన్ ఖర్చులు క్లయింటే భరించాలి. ఈ విధులకు సంబంధించి షోజి మొరిమొటొ కు కొన్ని షరతులు కూడా ఉన్నాయి. అవి.. విధుల్లో భాగంగా ఎలాంటి లైంగిక కార్యక్రమాలు ఉండరాదు. అలాగే, అనైతిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఉండరాదు.. మొదలైనవి.
No Work Job | ట్విటర్ ద్వారా..
ఇంతకీ ఈ షోజి ని కాంటాక్ట్ చేయడం ఎలా? అనుకుంటున్నారా? సింపుల్.. తన ట్విటర్ ఖాతాను ఫాలో కావడమే. ట్విటర్లో షోజి మొరిమొటొ కు 2. 5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి షోజి మొరిమొటొ ను 270 సార్లు హైర్ చేసుకున్నాడట. షోజి మొరిమొటొ గత నాలుగేళ్లలో నాలుగు వేల సెషన్స్ అటెండ్ అయ్యాడు. ‘నా జాబ్ ఏంటంటే నన్ను నేను అద్దెకు ఇచ్చుకుంటాను. నా క్లయింట్ తో పాటు తను వెళ్లిన దగ్గరకు వెళ్లి, కామ్ గా కూర్చోవడమే నా డ్యూటీ’ అని షోజి మొరిమొటొ వివరించాడు.
No Work Job | భారతీయులు కూడా..
షోజి మొరిమొటొ క్లయింట్లలో భారతీయులు కూడా ఉన్నారు. ఇటీవల అరుణ అనే యువతి చీర కట్టుకుని ఒక కార్యక్రమానికి వెళ్లడం కోసం కొద్దిగా నెర్వస్ గా ఫీలై, తోడుగా ఉంటాడని షోజి మొరిమొటొ ని హైర్ చేసుకుంది. ‘వేరే ఫ్రెండ్స్ నో, బంధువులనో తీసుకువెళ్తే, వారితో మాట్లాడాలి. వారిని ఎంగేజ్ చేయాలి. అదో తలనొప్పి. ఇలా హైరింగ్ సర్వీస్ తో ఏ తలనొప్పి ఉండదు` అని ఆ డేటా ఎనలిస్ట్ వివరించారు.