తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5g In India : 5జీ కోసం 89శాతం మంది భారతీయుల ఎదురుచూపులు!

5G in India : 5జీ కోసం 89శాతం మంది భారతీయుల ఎదురుచూపులు!

Sharath Chitturi HT Telugu

08 August 2022, 14:39 IST

    • 5G in India : దేశంలో 5జీకి డిమాండ్​ విపరీతంగా ఉంది. ఈ విషయం తాజాగా జరిగిన ఓ సర్వేలో తేలింది.
5జీ కోసం 89శాతం మంది భారతీయులు ఎదురుచూపులు!
5జీ కోసం 89శాతం మంది భారతీయులు ఎదురుచూపులు! (REUTERS/Albert Gea)

5జీ కోసం 89శాతం మంది భారతీయులు ఎదురుచూపులు!

5G in India : దేశంలో 5జీని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే బిడ్డింగ్​ ప్రక్రియ పూర్తయింది. మరి ప్రజల్లో 5జీపై జోష్​ ఎలా ఉంది? అన్న విషయంపై తాజాగా.. ఓ సర్వే జరిగింది. 89శాతం మంది భారతీయులు.. 5జీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నట్టు ఆ సర్వేలో తేలింది. వారందరు 5జీకి అప్డేట్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది.

నెట్​వర్క ఇంటెలిజెన్స్​ సంస్థ ఓక్లా.. ఈ సర్వే చేపట్టింది. 4జీ కన్నా.. 5జీ 10రెట్లు వేగంగా కనెక్టివిటీని అందించినా.. ధరలు, కవరేజీ, వినియోగం వంటివి తొలి దశలో సవాళ్లుగా మారతాయని అభిప్రాయపడింది.

"5జీ ధరలు ఎక్కువగా ఉంటే ప్రజలు వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదు. సర్వేలో పాల్గొని, 5జీకి అప్డేట్​ అవ్వము అని చెప్పివారిలో 25శాతం మంది.. ధరల గురించే ఆలోచిస్తున్నట్టు తెలిపారు. మరో 24శాతం మంది 5జీపై అవగాహన లేకపోవడంతో అప్డేట్​ అవ్వము అని అన్నారు. ఇక 23శాతం మంది.. తమ వద్ద 5జీ ఫోన్​ లేని కారణంగా అప్డేట్​ అవ్వమని తేల్చారు," అని ఓక్లా సర్వే స్పష్టం చేసింది.

5G network : ఏదేమైనప్పటికీ.. 89శాతం మంది భారతీయులు 5జీ పట్ల కుతుహలంగా ఉన్నారు. వారిలో 70శాతమంది.. వీడియో స్ట్రీమింగ్​ వేగం పెరుగుతుందని ఆశిస్తున్నారు. 68శాతం మంది.. మొబైల్​ గేమింగ్​లో వేగం పెరుగుతుందని 5జీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నట్టు వివరించారు.

"4జీ/ఎల్​టీఈ నెట్​వర్క్​కు డిమాండ్​ విపరీతంగా ఉంది. మొబైల్​ గేమింగ్​, వీడియో స్ట్రీమింగ్​కి అనువుగా ఉండటమే ఇందుకు కారణం. 5జీ వస్తే.. డిమాండ్​ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఆపరేటర్లు 5జీని సొంతం చేసుకున్నారు. ముందుగా మార్కెట్​లోకి 5జీని ప్రవేశపెట్టేందుకు వారందరు పోటీ పడుతూ ఉంటారు. కొన్ని నెలల్లో 5జీ వచ్చేస్తుందని ఇప్పటికే ఆయా ఆపరేట్లు ధీమాగా చెబుతున్నారు," అని ఓక్లా ప్రిన్సిపల్​ ఎనలిస్ట్​ సిల్వియా కెచిచె అభిప్రాయపడ్డారు.

5జీ హార్డ్​వేర్​ ధరలు దిగొస్తే.. డిమాండ్​ కూడా పెరుగుతుందని సర్వే పేర్కొంది.

తదుపరి వ్యాసం