5G spectrum auction : 5జీ వేలంలో జియో జోరు.. 58.65శాతం బిడ్లు అంబానీవే!-reliance jio accounts for 58 65 per cent of total rs 1 5 lakh crore mop ups in 5g auction ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5g Spectrum Auction : 5జీ వేలంలో జియో జోరు.. 58.65శాతం బిడ్లు అంబానీవే!

5G spectrum auction : 5జీ వేలంలో జియో జోరు.. 58.65శాతం బిడ్లు అంబానీవే!

Sharath Chitturi HT Telugu
Aug 01, 2022 07:43 PM IST

5G spectrum auction : 5జీ స్పెక్ట్రమ్​ వేలం సోమవారం ముగిసింది. ఇందులో రిలయన్స్​ జియో జోరు స్పష్టంగా కనిపించింది.

5జీ వేలంలో జియో జోరు.. 58.65శాతం బిడ్లు ఆ సంస్థవే!
5జీ వేలంలో జియో జోరు.. 58.65శాతం బిడ్లు ఆ సంస్థవే! (REUTERS)

5G spectrum auction : 5జీ స్పెక్ట్రమ్​ వేలంలో రిలయన్స్​ జియో జోరు స్పష్టంగా కనిపించింది. ఏడు రోజుల పాటు జరిగిన వేలంలో ముకేష్​ అంబానీకి చెందిన రిలయన్స్​ జియో ఇన్​ఫోకామ్​ లిమిటెడ్​ సంస్థ.. రూ. 88,078కోట్లు విలువ చేసే బిడ్లను దాఖలు చేసింది. మొత్తం దాఖలైన బిడ్లలో(రూ. 1,50,173కోట్లు).. ఒక్క జియో వాటానే 58.65శాతంగా ఉండటం విశేషం.

5జీ స్పెక్ట్రమ్​ వేలం ముగింపు అనంతరం మీడియాతో మాట్లాడారు టెలికాంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​. రిలయన్స్​ జీయో.. 700ఎంహెచ్​జెడ్​, 800ఎంహెచ్​జెడ్​, 1800ఎంహెచ్​జెడ్​, 3300ఎంహెచ్​జెడ్​, 26జీహెచ్​జెడ్​తో కూడిన మొత్తం 24,740ఎంహెచ్​జెడ్​ స్పెక్ట్రమ్​ కోసం వేలం వేసినట్టు పేర్కొన్నారు.

ఇక ఎయిర్​టెల్​.. జియో తర్వాతి స్థానంలో నిలిచింది. మొత్తం మీద.. 19867.8ఎంహెచ్​జెడ్​ కోసం రూ.43,084కోట్లు విలువ చేసే బిడ్లు వేసింది ఎయిర్​టెల్​. ఆ తర్వాతి స్థానంలో వొడాఫోన్​ ఐడియా ఉంది. 6,228ఎంహెచ్​జెడ్​ కోసం రూ. 18,799కోట్లు విలువ చేసే బిడ్లను వేసింది ఆ సంస్థ.

రిలయన్స్​ జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియాతో పాటు అదానీ డేటా నెట్​వర్క్స్​ లిమిటెడ్​ కూడా 5జీ స్పెక్ట్రమ్​ వేలంలో పాల్గొంది. 400ఎంహెచ్​జెడ్​ స్పెక్ట్రమ్​ కొనుగోలుకు రూ. 212కోట్లు విలువ చేసే బిడ్లను వేసింది.

దేశంలోనే తొలిసారిగా.. జులై 26న 5జీ స్పెక్ట్రమ్​ వేలం మొదలైంది. ఏడు రోజుల పాటు సాగిన వేలం.. సోమవారం ముగిసింది. మొత్తం మీద బిడ్డింగ్​ కోసం 40రౌండ్లు జరిగాయి. బిడ్లు వేసిన వాటిల్లో.. 71శాతం 5జీ స్పెక్ట్రమ్​ అమ్ముడుపోయింది.

  • ఆగ‌స్ట్ 15వ తేదీ నాటికి అలోకేష‌న్ స‌హా మొత్తం బిడ్డింగ్ ప్ర‌క్రియ‌ను ముగించాల‌ని కేంద్రం భావిస్తోంది. అలాగే, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో 5G సేవ‌ల‌ను ఈ సెప్టెంబ‌ర్ నాటికి అందించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ప్ర‌స్తుతం 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, and 26 GHz బ్యాండ్‌విడ్త్స్‌ను వేలంలో ఉంచారు.
  • స‌క్సెస్‌ఫుల్ బిడ్డ‌ర్ల‌కు 20 ఏళ్ల పాటు ఈ స్పెక్ట్రం అందుబాటులో ఉంటుంది.
  • ఈ వేలంలో విజ‌య‌వంత‌మైన బిడ్డ‌ర్లు 20 ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని 20 వార్షిక వాయిదాల్లో చెల్లించ‌వ‌చ్చు.
  • ఈ ఎయిర్‌వేవ్స్ కు రూ. 4.3 ల‌క్ష‌ల కోట్ల‌ను రిజ‌ర్వ్ ప్రైస్‌గా నిర్ధారించింది.
  • ఇప్ప‌టికే ట్రాయ్ ప‌లు చోట్ల పైల‌ట్ ప్రాజెక్టుగా 5జీని ప్రారంభించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌, బెంగ‌ళూరు మెట్రో, కాండ్లా పోర్ట్‌, భోపాల్‌లోని 11ప్ర‌దేశాల్లో 5G సేవ‌ల‌ను జియో, ఎయిర్‌టెల్‌, వీఐ, బీఎస్ఎన్ఎల్ స‌హ‌కారంతో పైల‌ట్ ప్రాజెక్టుగా అందిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం