5G spectrum auction : ముగిసిన 5జీ వేలం.. బిడ్​ వాల్యూ @1,50,173కోట్లు!-5g spectrum auction ends total bids at over rs 1 5 lakh cr ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  5g Spectrum Auction Ends; Total Bids At Over Rs 1.5 Lakh Cr

5G spectrum auction : ముగిసిన 5జీ వేలం.. బిడ్​ వాల్యూ @1,50,173కోట్లు!

Sharath Chitturi HT Telugu
Aug 01, 2022 03:17 PM IST

5G spectrum auction : జులై 26న ప్రారంభమైన 5జీ స్పెక్ట్రమ్​ వేలం.. సోమవారం మధ్యాహ్నం ముగిసింది. మొత్తం మీద.. రూ. 1,50,173కోట్లు విలువ చేసే బిడ్లు దాఖలైనట్టు సమాచారం.

ముగిసిన 5జీ వేలం
ముగిసిన 5జీ వేలం (Mint)

5G spectrum auction : దేశంలో 5జీ స్పెక్ట్రమ్​ వేలం సోమవారం ముగిసింది. రూ. 1,50,173కోట్లు విలువైన స్పెక్ట్రమ్​కు బిడ్లు దాఖలైనట్టు పీటీఐ నివేదిక పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

జులై 26న 5జీ స్పెక్ట్రమ్​ మొదలైంది. ఏడు రోజుల పాటు సాగిన 5జీ స్పెక్ట్రమ్​ వేలం.. సోమవారం మధ్యాహ్నంతో ముగిసినట్టు తెలుస్తోంది.

రిలయన్స్​ జియో, భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా ఈ 5జీ వేలంలో పాల్గొన్నాయి. అపర కుబేరుడు గౌతమ్​ ఆదానీకి చెందిన అదానీ ఎంటర్​ప్రెజెస్​ కూడా ఈ 5జీ వేలంలో పాల్గొని అందరికి షాక్​ ఇచ్చింది.

5జీ స్పెక్ట్రమ్​ వేలంలోని చివరి ఆరు రోజుల్లో రూ. 1,50,130కోట్లు విలువ చేసే బిడ్లు దాఖలయ్యాయి.

5జీ స్పెక్ట్రమ్​కు లభించిన డిమాండ్​పై టెలికాంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమలో ఎదగాలన్న పట్టుదల కనిపిస్తోందన్నారు. పరిశ్రమకు గడ్డుకాలం ముగిసిందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 5జీతో.. 4జీ కన్నా 10 రెట్లు వేగంగా ఇంటర్నెట్​ను అందించవచ్చని స్పష్టం చేశారు.

ఆగ‌స్ట్ 15వ తేదీ నాటికి అలోకేష‌న్ స‌హా మొత్తం బిడ్డింగ్ ప్ర‌క్రియ‌ను ముగించాల‌ని కేంద్రం భావిస్తోంది. అలాగే, దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో 5G సేవ‌ల‌ను ఈ సెప్టెంబ‌ర్ నాటికి అందించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. ప్ర‌స్తుతం 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz, and 26 GHz బ్యాండ్‌విడ్త్స్‌ను వేలంలో ఉంచారు.

  • స‌క్సెస్‌ఫుల్ బిడ్డ‌ర్ల‌కు 20 ఏళ్ల పాటు ఈ స్పెక్ట్రం అందుబాటులో ఉంటుంది.
  • ఈ వేలంలో విజ‌య‌వంత‌మైన బిడ్డ‌ర్లు 20 ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని 20 వార్షిక వాయిదాల్లో చెల్లించ‌వ‌చ్చు.
  • ఈ ఎయిర్‌వేవ్స్ కు రూ. 4.3 ల‌క్ష‌ల కోట్ల‌ను రిజ‌ర్వ్ ప్రైస్‌గా నిర్ధారించింది.
  • ఇప్ప‌టికే ట్రాయ్ ప‌లు చోట్ల పైల‌ట్ ప్రాజెక్టుగా 5జీని ప్రారంభించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌, బెంగ‌ళూరు మెట్రో, కాండ్లా పోర్ట్‌, భోపాల్‌లోని 11ప్ర‌దేశాల్లో 5G సేవ‌ల‌ను జియో, ఎయిర్‌టెల్‌, వీఐ, బీఎస్ఎన్ఎల్ స‌హ‌కారంతో పైల‌ట్ ప్రాజెక్టుగా అందిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్