తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video : ‘పింఛను కష్టాలు’.. కుర్చీ సాయంతో బ్యాంక్​కు 70ఏళ్ల వృద్ధురాలు- చెప్పులు లేకుండానే నడక!

Viral video : ‘పింఛను కష్టాలు’.. కుర్చీ సాయంతో బ్యాంక్​కు 70ఏళ్ల వృద్ధురాలు- చెప్పులు లేకుండానే నడక!

Sharath Chitturi HT Telugu

11 December 2023, 12:20 IST

google News
    • Viral video : ఒడిశాకు చెందిన ఓ 70ఏళ్ల వృద్ధురాలు.. కుర్చీ సాయంతో, చెప్పులు లేకుండా కి.మీల దూరం నడుస్తున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. తన పింఛను డబ్బులను విత్​డ్రా చేసుకోవడానికి కుదరకపోవడంతో ఆమె బ్యాంక్​ వరకు ఇలా నడుచుకుంటూ వెళ్లింది!
కుర్చీ సాయంతో నడుస్తున్న వృద్ధురాలు..
కుర్చీ సాయంతో నడుస్తున్న వృద్ధురాలు.. (Screenshot/viral video)

కుర్చీ సాయంతో నడుస్తున్న వృద్ధురాలు..

Odisha Viral video : వృద్ధుల 'పింఛను' కష్టాలు వర్ణణాతీతంగా ఉంటాయి. వృద్ధాప్యంలో చాలా మందికి ఆ పింఛనే బతుకుదెరువు. సమయానికి పింఛను అందకపోతే పూటగడవని పరిస్థితిలో చాలా మంది ఉంటారు. వీరికి ప్రభుత్వాలు సాయం చేస్తున్నా.. ఏదో ఒకమూల వృద్ధులు కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ఒడిశాకు చెందిన ఓ వైరల్​ వీడియో ఇందుకు తాజా ఉదాహరణ! నడవడానికి కూడా ఓపిక లేని ఓ వృద్ధురాలు.. పింఛను కోసం చెప్పులు లేకుండా కాలి నడకన అనేక కి.మీలు ప్రయాణించి బ్యాంక్​కు వెళ్లింది. కుర్చీ పట్టుకుని ఆమె నడుస్తున్న దృశ్యాలు చూసి నెటిజన్లు షాక్​కు గురయ్యారు.

అసలేం జరిగింది..?

సంబంధిత వీడియో.. ఒడిశా నాబ్రంగ్​పూర్​ జిల్లాలో ఈ నెల 17న తీసినదిగా తెలుస్తోంది. వీడియో ఓ వృద్ధురాలు.. చెప్పులు లేకుండా ఎండలో కాలి నడకన, కుర్చీ సాయంతో రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ కనిపించింది.

Odisha woman viral video : వీడియోలో ఉన్న వృద్ధురాలి పేరు సూర్య హరిజన్​. ఆమె వయస్సు 70ఏళ్లు. ఆమెకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వేరే రాష్ట్రంలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. సూర్య హరిజన్​.. తన చిన్న కుమారుడి ఇంట్లో నివాసముంటోంది. అతను పశువుల కాపరి. ఈ కుటుంబానికి సొంతంగా భూమి అంటూ ఏమీ లేదు. చిన్న గుడుసెలో నివాసముంటోంది.

కాగా.. సూర్య హరిజన్​కు నెలకు రూ. 3వేల పింఛను లభిస్తుంది. ఈసారి ఆమె ఆ నగదును విత్​డ్రా చేసుకోలేకపోయింది. కానీ బ్యాంక్​ వరకు వెళ్లేందుకు తన వద్ద వాహనం లేదు. ఎవరూ సాయం కూడా చేయలేదు. అందుకే కాలి నడకన ఝారిగావ్​ బ్రాంచ్​కు వెళ్లింది. అయినా అక్కడ ఆమె డబ్బును విత్​డ్రా చేసుకోలేకపోయింది. ఆమె ఇంటికి తిరిగి వెళ్లిపోయింది.

Surya Harijan Odisha : వృద్ధురాలి పరిస్థితిపై ఎస్​బీఐ బ్యాంక్​ అధికారులు స్పందించారు. ఆమె వేళ్లు విరిగిపోవడంతో.. ఫింగర్​ప్రింట్​ సరిగ్గా మ్యాచ్​ అవ్వలేదని వివరించారు.

"ఆమె వేళ్లు విరిగిపోయాయి. రికార్డుల్లో ఉన్న ఆమె ఫింగర్​ప్రింట్​కు ఇప్పుడు మ్యాచ్​ అవ్వట్లేదు. బ్యాంక్​ నుంచి ఆమెకు రూ. 3వేలు మేము ఇచ్చాము. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాము," అని ఎస్​బీఐ ఝారిగావ్​ బ్రాంచ్​ మేనేజర్​ తెలిపారు.

Surya Harijan viral video : ఈ ఘటనపై స్పందించిన సర్పంచ్​.. వృద్ధురాలితో పాటు పింఛను విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారి జాబితాను సిద్ధం చేస్తామని తెలిపారు. వారందరికి సాయం చేస్తామని స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

తదుపరి వ్యాసం