తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stocks To Buy Today : ట్రేడర్స్​.. నేటి 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే!

Stocks to buy today : ట్రేడర్స్​.. నేటి 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే!

Sharath Chitturi HT Telugu

20 September 2022, 8:53 IST

google News
    • Stocks to buy today in telugu : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. అవేంటంటే..
స్టాక్స్​ టు బై
స్టాక్స్​ టు బై (iStock)

స్టాక్స్​ టు బై

Stocks to buy today in Telugu : దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​తో.. వరుస నష్టాలకు బ్రేక్​ వేశాయి. బ్యాంకింగ్​, ఫైనాన్స్​, ఎఫ్​ఎంసీజీ, ఆటోలో కొనుగోళ్ల జోరుతో.. స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 300 పాయింట్ల లాభంతో 59,141 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 0.52శాతం పెరిగి 17,622కు చేరింది.

బీఎస్​ఈ మిడ్​ క్యాప్​ సూచీ 0.16శాతం, బీఎస్​ఈ స్మాల్​ క్యాప్​ సూచీ 0.17శాతం వృద్ధిచెందాయి.

అయితే.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ ట్రెండ్​ నెగిటివ్​గా ఉందని మార్కెట్​ విశ్లేషకులు చెబుతున్నారు. 18000 మార్కును దాటితే.. మార్కెట్లలోకి బుల్స్​ తిరిగి వచ్చినట్టు భావించవచ్చని అంటున్నారు. 17,450 దిగువకు మార్కెట్​ చేరితే.. మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు ప్రకటన త్వరలో వెలువడనుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్​ మార్కెట్లకు ఇది అత్యంత కీలకంగా మారింది. ఈ ప్రకటన కోసం మదుపర్లు వేచి చూస్తున్నారు. ఈ ఈవెంట్​ ముగిసిన తర్వాత.. స్టాక్​ మార్కెట్లు ఓ డైరెక్షన్​ తీసుకునే అవకాశం ఉంది.

Stocks to buy today : స్టాక్స్​ టు బై:-

  • అంబుజా సిమెంట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 534, టార్గెట్​- రూ. 610.
  • పిడిలైట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 2720, టార్గెట్​ రూ. 2,920.
  • ఇండియా సిమెంట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 286, టార్గెట్- రూ. 305.
  • Stock market news today : ఎం అండ్​ ఎం:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 1275, టార్గెట్​ రూ. 1320.
  • బజాజ్​ ఫినాన్స్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 7052, టార్గెట్​- రూ. 7994.
  • రెయిన్​బో హాస్పిటల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​- రూ. 622, టార్గెట్​- రూ. 722.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. నిపుణుల సూచనలతో హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ట్రేడర్లకు సొంతంగా అనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం