తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Elections : తెలంగాణలోనూ బీజేపీ హవా! బీఆర్​ఎస్​కి రెండు సీట్లే!

Lok Sabha elections : తెలంగాణలోనూ బీజేపీ హవా! బీఆర్​ఎస్​కి రెండు సీట్లే!

Sharath Chitturi HT Telugu

16 March 2024, 8:10 IST

  • News18 opinion poll : లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఒపీనియన్​ పోల్స్​ ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. తాగాజా వచ్చిన ఓ సర్వే ప్రకారం.. ఎన్​డీఏకి 400 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి!

2024 లోక్​సభ ఎన్నికలపై న్యూస్​18 ఒపీనియన్​ పోల్​..
2024 లోక్​సభ ఎన్నికలపై న్యూస్​18 ఒపీనియన్​ పోల్​..

2024 లోక్​సభ ఎన్నికలపై న్యూస్​18 ఒపీనియన్​ పోల్​..

2024 Lok Sabha elections : ఇంకొన్ని గంటల్లో 2024 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ వెలువడనుంది. హ్యాట్రిక్​ కొట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి గట్టిగా కృషి చేస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు విపక్ష ఇండియా అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అయితే.. దేశంలో వెలువడుతున్న ఎన్నికల సర్వేలు.. ఇండియా కూటమి గెలవడం కష్టమే అని సూచిస్తున్నాయి. ఇక తాజాగా బయటకి వచ్చిన న్యూస్​18 ఒపీనియన్​ పోల్​ కూడా ఇదే స్పష్టం చేసింది. అంతే కాదు.. ‘అబ్​ కీ బార్​, 400 పార్​’ అన్న బీజేపీ సంకల్పం.. నిజమవుతుందని కూడా తేల్చేసింది!

న్యూస్​ 18 ఒపీనియన్​ పోల్​..

ఓపీనియన్​ పోల్​ ప్రకారం.. 543 లోక్​సభ సీట్లల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ 411 స్థానాల్లో గెలుస్తుంది. బీజేపీ 300 సీట్లు గెలుచుకుంటుంది. జేడీయూ, టీడీపీ సహా ఇతర ఎన్​డీఏ భాగస్వామ్య పక్షాలు61 సీట్లల్లో విజయం సాధిస్తాయి. ఇక కాంగ్రెస్ 49 స్థానాలతో సహా దిగువ సభలో ఇండియా కూటమి కేవలం 105 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది.

అంచనాలు నిజమైతే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో అతి పెద్ద పరాజయాన్ని చవిచూసినట్టే!. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ 44 సీట్లు మాత్రమే సాధించింది.

న్యూస్​18 ఒపీనియన్ పోల్ ప్రకారం.. ఒడిశా, తెలంగాణ, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలు సాధిస్తుంది. రాష్ట్రాల వారీగా ఒపీనియన్ పోల్ ఫలితాలను ఈ క్రింద చూడండి.

2024 Lok Sabha elections opinion polls : 1. మహారాష్ట్ర: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన-ఎన్​సీపీ కూటమి మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుంది. 48 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే 41 సీట్లు గెలుచుకుంటుంది. మరోవైపు కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్​సీపీ, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లతో కూడిన ఇండియా కూటమి.. కేవలం ఏడు సీట్లను మాత్రమే గెలుచుకుంటుంది.

2. పశ్చిమబెంగాల్: పశ్చిమ్​ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గణనీయంగా క్షీణించే అవకాశం ఉంది. 42 సీట్లల్లో బీజేపీ 25 చోట్ల గెలుస్తుంది. అయితే, టీఎంసీ తన రాష్ట్రంలో కేవలం 17 సీట్లు మాత్రమే గెలుచుకుంటుంది. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు.

3. కర్ణాటక: కర్ణాటకలో ఎన్​డీఏ 2019లో తన ప్రదర్శనను పునరావృతం చేస్తుంది. ఇక్కడ 28 సీట్లకు గాను 25 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కించుకుంటుంది. ఈసారి జేడీఎస్​తో కలిసి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

Lok Sabha elections BJP : 4) గుజరాత్: ఇక్కడ మొత్తం 26 స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీజేపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుంది. 2014, 2019లో బీజేపీ మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాతా తెరవకపోవచ్చు.

5) తెలంగాణ: 17 సీట్లలో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంటుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఆరు స్థానాలు దక్కించుకుంటుంది. బీఆర్​ఎస్​కి రెండు సీట్లు మాత్రమే వస్తాయి.

6) ఒడిశా: ఒడిశాలో అధికార బీజేడీ 8, బీజేపీ 13 సీట్లు గెలుచుకుంటాయి.

2024 Lok Sabha elections schedule : 7. ఉత్తర్​ప్రదేశ్: యూపీలో 80 సీట్లు ఉంటాయి. ఈ సర్వే ప్రకారం ఎన్​డీఏ 77 సీట్లు వస్తాయి. ప్రతిపక్ష ఇండియా కూటమికి రెండు సీట్లు రావొచ్చు. బీఎస్​పీకి కేవలం ఒక్కటే సీటు వస్తుంది.

మరి ఈ ఒపీనియన్​ పోల్స్​ చెప్పేవి నిజమవుతాయా? అనేది 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల వరకు ఎదూరుచూడాల్సిందే.

తదుపరి వ్యాసం