Mamata Banerjee Injury: బెంగాల్ CM మమతా తలకు గాయం.. రక్తం కారుతున్న ఫోటో విడుదల-wb cm mamata banerjee hospitalized due to injury ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mamata Banerjee Injury: బెంగాల్ Cm మమతా తలకు గాయం.. రక్తం కారుతున్న ఫోటో విడుదల

Mamata Banerjee Injury: బెంగాల్ CM మమతా తలకు గాయం.. రక్తం కారుతున్న ఫోటో విడుదల

Mar 15, 2024 10:35 AM IST Muvva Krishnama Naidu
Mar 15, 2024 10:35 AM IST

  • 2024 లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తలకు గాయమైంది. ఆమెకు తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న SSKM ఆసుపత్రికి తరలించారు. సీఎంకి గాయమైన ఫోటోలను ట్విటర్ లో షేర్ చేసిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్.. ఆమె శ్రేయోభిలాషుల ప్రార్థనలు చేయాలని కోరింది. ఆమె మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వెలుపల గుమిగూడారు. ఇదిలా ఉండగా మమత త్వరగా కోలుకోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, టీఎన్ సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు ప్రార్థించారు. అయితే ఈ గాయం ఎలా అయ్యిందో మాత్రం టీఎంసీ నేతలు చెప్పలేదు. అటు 2021 WB శాసనసభ ఎన్నికల ముందు కూడా మమతకు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. 2023 పంచాయతీ ఎన్నికల ముందు ఎడమ కాలికి గాయమైంది.

More