తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Smoke In Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

Smoke in Air India flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

HT Telugu Desk HT Telugu

14 September 2022, 16:53 IST

google News
  • Smoke in Air India flight: మరో ఎయిర్ ఇండియా విమానం కొద్దిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ప్రయాణానికి కొద్ది క్షణాల ముందు విమానం ఇంజిన్ లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది, వెంటనే ప్రయాణీకులను విమానం నుంచి దించేశారు. 

     

విమానం ఇంజిన్ లో నుంచి పెద్ద ఎత్తున వస్తున్న పొగలు
విమానం ఇంజిన్ లో నుంచి పెద్ద ఎత్తున వస్తున్న పొగలు

విమానం ఇంజిన్ లో నుంచి పెద్ద ఎత్తున వస్తున్న పొగలు

Smoke in Air India flight: మస్కట్ విమానాశ్రయంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్ నుంచి కొచ్చి కి రావల్సిన ఎయిర్ ఇండియా విమానం మరి కొద్ది క్షణాల్లో బయల్దేరుతుందనగా, ఈ ముప్పును సిబ్బంది గుర్తించారు.

Smoke in Air India flight: మస్కట్ టు కొచ్చి

బుధవారం మస్కట్ విమానాశ్రయంలో కొచ్చికి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ప్రయాణీకులంతా తమతమ స్థానాల్లో కూర్చున్నారు. సిబ్బంది విధులకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో విమానంలోని ఒక ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున పొగ రావడాన్ని పైలట్లు గుర్తించి, విమానాన్ని నిలిపేశారు.

Smoke in Air India flight: ప్రయాణీకులు సేఫ్

వెంటనే ప్రయాణీకులను విమానం నుంచి దింపేశారు. మొత్తం 141 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులను కొచ్చి కి పంపించడం కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అది బోయింగ్ 737 విమానమని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. రెండు నెలల క్రితం కాలికట్ నుంచి దుబాయి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్ లో నుంచి పొగలు రావడంతో, ఆ విమానాన్ని హుటాహుటిన మస్కట్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

తదుపరి వ్యాసం