Lips Shape : మీ పెదవులు చూసి.. మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చు!
10 October 2023, 19:00 IST
- Lips Shape Reveals : ఒక మనిషి ఎలాంటివాడో అని చూసి చెప్పడం కష్టం కదా. అయితే కొన్ని ట్రిక్స్ పాటిస్తే.. కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. పెదవులు చూసి కూడా మీ వ్యక్తిత్వా్న్ని చెప్పొచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
పెదాలను బట్టి మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు తెలుసా..? వ్యక్తిత్వం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కానీ ప్రతి మనిషిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి. అందుకే కొందరి ఆలోచనలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. పెదాలు సన్నగా, లావుగా ఉన్నవారి మైండ్ సెట్ ఎలా ఉంటుుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి పర్సనాలిటీ బట్టి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పే స్టడీస్ ఉన్నాయి. ఒక వ్యక్తి కాళ్ల వేళ్లు, కళ్లు, చేతుల వేళ్లు బట్టి వారి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పేయొచ్చు. అలాగే ఒక వ్యక్తి పెదాలను బట్టి కూడా వారు ఎలాంటి వారో చెప్పొచ్చట. పెదవులు భావోద్వేగ స్థితి, విశ్వాస స్థాయి, తెలివితేటలు లాంటి అనేక ఇతర విషయాలను చెప్తాయి.
సన్నటి పెదవులు ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?
సన్నగా పెదవులు ఉన్న వ్యక్తి మేధోపరంగా మరింత బలంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు సాధారణంగా తమ ఆలోచనలు, భావాలను ఇతరులతో పంచుకునే అవకాశం తక్కువ. పిరికిగా ఉంటారు. ఇలాంటి వారు సాధారణంగా తమ సొంత సమయాన్ని తమతో గడపడానికి ఇష్టపడతారు. సన్నటి పెదవులు ఉన్నవారు చాలా ఆలోచిస్తారు. అయితే అతిగా ఆలోచించేవారిగా ఉండకండి. అలాంటి వారు ఒంటరిగా ఉన్నారని అందరూ అనుకోవచ్చు. కానీ అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు ఒంటరిగా ఉన్నప్పటికీ వారి ఆలోచనలపై పని చేస్తారు.
పెదవులు లావుగా ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?
నిండు పెదవులు ఉన్నవారు మరింత ప్రేమగా, ఆశావాదంగా ఉంటారు. వారు తమ అవసరాలను కాకుండా ఇతరుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఎల్లప్పుడూ బాధ్యతగా ఉండేందుకు ఇష్టపడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, కొన్నిసార్లు, మొండిగా, అంగీకరించనవారిగా ఉంటారు. వీరు తేలికగా ఫ్రెండ్స్ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుంటారు.
నిండు పెదవులు ఉన్నవారు చాలా మాట్లాడగలరు. వారి భావాలను మాటలతో వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. పారదర్శకంగా ఉండటానికి ఇష్టపడతారు. వీరికి కోపం తక్కువగా వస్తుంది. సహనం ఎక్కువ.. వీరు తమ కోపాన్ని ముఖ కవళికలు లేదా బాడీ లాంగ్వేజ్ ద్వారా చూపిస్తారు. ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ.. ఇంతకీ మీ పెదవులు ఎలా ఉన్నాయి?