తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఒంటి నొప్పులు, అలసట నుండి ఉపశమనం కలిగిచే యోగాసనాలు ఇవే

ఒంటి నొప్పులు, అలసట నుండి ఉపశమనం కలిగిచే యోగాసనాలు ఇవే

HT Telugu Desk HT Telugu

24 November 2023, 9:23 IST

google News
    • Best Yoga Poses To Reduce Pain: శరీర నొప్పులు, అలసట తగ్గించగలిగే యోగా భంగిమల గురించి తెలుసుకోండి.
యోగాసనాలతో ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం
యోగాసనాలతో ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం (Freepik)

యోగాసనాలతో ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం

ఒంటి నొప్పులు పోగొట్టుకోవడానికి యోగా ఆసనాలు: నేటి జీవన విధానం చాలా ఉరుకులు పరుగులతో కూడుకుని ఉంటోంది. దీంతో సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సమయాభావంతో వ్యాయామం చేయకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోంది. 

ప్రస్తుతం, అధిక సంఖ్యలో ప్రజలు శరీర నొప్పులు, అలసటతో బాధపడుతున్నారు. యువత కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. నొప్పి, అలసట మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగితే దీర్ఘకాలిక నొప్పి, అలసటగా పరిగణించవచ్చు. 

ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలోని 30% కంటే ఎక్కువ మంది ప్రజలు దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్నారు. శరీర నొప్పులతో పాటు అలసట కూడా ప్రజలకు పెద్ద సమస్యగా మారుతోంది. అలసట చాలా నెలలు కొనసాగితే, అది క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌కి సంకేతం కూడా కావచ్చు. నొప్పి, అలసట నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు మందుల వైపు మొగ్గు చూపుతారు. అయితే చాలా రోజుల పాటు మందులు వాడినా ఈ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు.

యోగాతో ఉపశమనం

యోగా ద్వారా ఈ రెండు సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. యోగా అనేక రకాల దీర్ఘకాలిక నొప్పి, అలసటను తగ్గించగలదని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. బాధాకరమైన ప్రదేశంలో రక్త ప్రసరణను పెంచడం, విషపూరిత జీవక్రియలను తొలగించడం, వాపును తగ్గించడం ద్వారా యోగా నొప్పిని తగ్గిస్తుంది. దీనికి చంద్రభేది ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం చేయడం చాలా మేలు చేస్తుంది.

ఏ యోగాసనాలు ప్రయోజనకరంగా ఉంటాయి?

యోగాసనాలు క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌లో అలసటను తగ్గించడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా యోగ నిద్రా వంటి రిలాక్సేషన్ టెక్నిక్‌లు అలసటను తగ్గిస్తాయి. నిమిషాల్లో మీకు రిఫ్రెష్‌గా ఉంటాయి. శవాసనం, అనంతాసనం, బాలాసనం, నౌకాసనాల అభ్యాసం దీర్ఘకాలిక అలసట నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది.

శవాసనం

శవాసనం కోసం వెల్లకిలా పడుకోండి. రెండు పాదాలను వీలైనంత దూరంగా ఉంచండి. రెండు చేతులను శరీరానికి ఒక అడుగు దూరంలో ఉంచి, వేళ్లను వంచి మెడను నిటారుగా ఉంచి కళ్లు మూసుకోవాలి. శవాసనం సాధన చేస్తున్నప్పుడు, కాలి నుండి తల వరకు మొత్తం శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. మనస్సును శ్వాసపై కేంద్రీకరించండి.

టాపిక్

తదుపరి వ్యాసం