తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga: ఈ ఆసనాలు వేస్తే రాత్రి పూట హాయిగా నిద్రపోతారు!

Yoga: ఈ ఆసనాలు వేస్తే రాత్రి పూట హాయిగా నిద్రపోతారు!

28 February 2022, 16:47 IST

google News
    • ఈ మధ్య చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిళ్లు ఓ కారణమైతే.. మొబైల్ వాడకం ఎక్కవ కావడం మరో కారణం. అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే యోగాతో ఈ నిద్ర లేమికి కూడా చెక్ పెట్టవచ్చు. మరి మంచి నిద్ర కోసం ఉన్న ఆసనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మంచి నిద్ర కోసం యోగా
మంచి నిద్ర కోసం యోగా (pexels)

మంచి నిద్ర కోసం యోగా

మన యోగాకు ఇప్పుడు ప్రపంచమే సలాం కొడుతోంది. ప్రత్యేకంగా ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచ యోగా డే కూడా జరుపుకుంటున్నారు. ఈ యోగాతో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. రోజురోజుకూ ఈ యోగాసనాలు వేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఒక్కో వ్యాధికి యోగాలో ఆసనాలు ఉన్నట్లే నిద్ర లేమి సమస్య కోసం కూడా రెండు ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు ఏంటి? వాటిని ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం.

అశ్వ సంచలనాసనం

<p>నిద్ర లేమికి చెక్ పెట్టే అశ్వసంచలనాసనం</p>

పైన ఫొటోలో చూపించిన విధంగా ఈ అశ్వ సంచలనాసనం వేయాల్సి ఉంటుంది. పూర్తిగా బోర్లా పడుకున్న తర్వాత చేతులపై బరువు వేసి పైకి లేవాలి. తర్వాత కుడికాలిని ముందుకు తీసుకొచ్చి చేతుల మధ్య ఉంచాలి. ఎడమకాలు అలాగే వెనక్కి ఉండాలి. రెండు చేతులతో నమస్కారం చేస్తూ సాధ్యమైనంత వరకూ వెనక్కి వంగాలి. ఆ తర్వాత మరో కాలితోనూ ఇలాగే చేయాలి. ప్రతి రోజూ ఇలా చేయడం ద్వారా నిద్ర లేమి నుంచి బయటపడవచ్చు.

బాలాసనం

<p>బాలాసనం ఇలా వేయాలి</p>

బాలాసనం ఎలా వేయాలో పైన ఫొటోలో చూసి తెలుసుకోవచ్చు. మోకాళ్లపై కూర్చొని అలాగే ముందుకు వంగాలి. చేతులను ముందుకు చాపి నేలపై ఉంచాలి. ఈ సమయంలో మీ వెన్నెముక నిటారుగా ఉండాలి. ఇలా ప్రతి రోజూ ఈ భంగిమలో కొంతసేపు ఉంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

ఈ ఆసనాలతోపాటు పడుకునే ముందు స్నానం చేసినా హాయిగా ఉంటుంది. అప్పుడు చక్కగా నిద్ర పడుతుంది. అలాగే రాత్రి పూట భోజనం చేయగానే పడుకోకండి. ఇలా చేస్తే నిద్ర పట్టదు. కనీసం పడుకోవడానికి వెళ్లడానికి రెండు గంటల ముందు అన్నం తినాలి. నిద్ర కోసం మాత్రలు వంటి వేసుకోకుండా యోగా ద్వారా ప్రశాంతంగా నిద్ర పోవడం అలవాటు చేసుకోండి. 

టాపిక్

తదుపరి వ్యాసం