తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Xiaomi | భారత మార్కెట్లోకి షావోమి బ్రాండ్ నుంచి వివిధ స్మార్ట్ Tvలు విడుదల

Xiaomi | భారత మార్కెట్లోకి షావోమి బ్రాండ్ నుంచి వివిధ స్మార్ట్ TVలు విడుదల

HT Telugu Desk HT Telugu

27 April 2022, 18:01 IST

    • Xiaomi నుంచి వివిధ రకాల స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ ఫోన్లు విడుదలయ్యాయి. వాటి ధరలు, ఇతర వివరాలు ఇక్కడ ఉన్నాయి..
Xiaomi OLED Vision TV
Xiaomi OLED Vision TV

Xiaomi OLED Vision TV

షావోమి కంపెనీ భారత మార్కెట్లో రెండు కొత్త స్మార్ట్ TV మోడల్‌లను విడుదల చేసింది. ఇందులో Xiaomi TV 5A మోడల్ బడ్జెట్ ధరలలో రెండోది ప్రీమియం Xiaomi OLED విజన్ టీవీ.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti Telugu : పేదవాడిగా పుట్టినా.. ధనవంతులుగా బతికేందుకు చాణక్యుడు చెప్పిన రహస్యాలు

Biscuit Bonda : పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్ బోండా.. 5 నిమిషాల్లో రెడీ

Tuesday Motivation : బ్రేకప్ అయితే లైట్ తీసుకోండి బాస్.. అదే మీ విజయానికి తొలిమెట్టు

Summer Sleeping Problems : వేసవిలో రాత్రుళ్లు నిద్రించేందుకు ఇబ్బంది పడితే ఈ చిట్కాలు పాటించండి

Xiaomi TV 5A గురించి చెప్పుకుంటే.. ఇది మూడు స్క్రీన్ సైజులలో అందుబాటులో ఉంది. స్క్రీన్ సైజుల ఆధారంగా ఈ టీవీ ధరలు ఉన్నాయి.

32 అంగుళాల Xiaomi TV 5A ధర రూ. 13,499/-

40 అంగుళాల Xiaomi TV 5A ధర రూ. 20,999/-

43 అంగుళాల Xiaomi TV 5A ధర రూ. 23,999/-

Xiaomi స్మార్ట్ TV 5A టీవీని అందరి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించారు. ఇందులోని మూడు టీవీ మోడళ్లు ప్రీమియం మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌తో వచ్చాయి. అన్నింట్లోనూ డ్యూయల్-స్పీకర్‌లు ఉన్నాయి. అయితే 43 ఇంచ్ మోడల్‌లో మాత్రం అదనంగా DTS:X కోడెక్ సౌండ్ ఫీచర్ ఉంటుంది. ఈ మూడు మోడల్‌లు Android TV 11-ఆధారిత PatchWall 4పై రన్ అవుతాయి. వినియోగదారులు Google Play నుండి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం పేరెంటల్ లాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.

అన్ని Mi స్టోర్లు అలాగే ఇ-కామర్స్ వెబ్ సైట్లలో ఏప్రిల్ 30 నుంచి Xiaomi TV 5A టీవీల విక్రయాలు ప్రారంభమవుతాయి.

Xiaomi OLED విజన్ టీవీ

Xiaomi OLED విజన్ టీవీ 55-అంగుళాల వేరియంట్‌లో రూ. 89,999కి అందుబాటులో ఉంటుంది. ప్రారంభోత్సవ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ. 6,000 డిస్కౌంట్ ఇస్తున్నారు.

Xiaomi OLED విజన్ TV వినియోగదారులకు ప్రీమియం హోమ్-వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది పూర్తిగా 55 అంగుళాల OLED స్క్రీన్ ప్యానెల్‌తో వస్తుంది. డిస్‌ప్లే 4K రిజల్యూషన్ (3840×2160 పిక్సెల్‌లు), డాల్బీ విజన్ సపోర్ట్, 60Hz రిఫ్రెష్ రేట్, 98.5 శాతం వైడ్ కలర్ గామట్ DCI-P3 ఇంకా HDR10+ సపోర్ట్‌ని అందిస్తుంది.

ఆడియో పరంగా, ఈ టీవీలో డాల్బీ అట్మాస్ - DTS-X సౌండ్ సిస్టంతో మొత్తం ఎనిమిది-స్పీకర్ల సెటప్‌ ఉంది. ఇందులో నాలుగు స్ప్రీకర్లు యాక్టివ్ సౌండ్, మిగతా నాలుగు డ్రైవర్‌లు ప్యాసివ్ సౌండ్ అందిస్తాయి. Xiaomi OLED విజన్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11-ఆధారిత ప్యాచ్ 4 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

సాంకేతికపరంగా ఈ టీవీలో Mali G52 MC1 GPU, 3GB RAM, 32GB స్టోరేజ్ సామర్థ్యంతో పాటు సమర్థవంతమైన Quad-core Cortex A73 CPU మీద పనిచేస్తుంది. కనెక్టివిటీల పరంగా మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, ఒకే ఈథర్‌నెట్ పోర్ట్, WiFi 6 ఇంకా బ్లూటూత్ 5.0 లాంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ టీవీ మే 19న నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

షావోమి కంపెనీ తమ ఈ లాంచ్ ఈవెంట్‌లో కేవలం టీవీలు మాత్రమే కాకుండా 'Xiaomi 12 ప్రో' అనే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అలాగే Xiaomi Pad 5 టాబ్లెట్ ఫోన్‌ను విడుదల చేసింది.

టాపిక్