తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Vegan Day 2022 : వీగన్​గా మారితే ఆరోగ్యానికి కలిగే లాభాలు.. నష్టాలు ఇవే..

World Vegan Day 2022 : వీగన్​గా మారితే ఆరోగ్యానికి కలిగే లాభాలు.. నష్టాలు ఇవే..

01 November 2022, 13:22 IST

google News
    • Vegan Day 2022 : జంతువులకు హాని చేయకుండా.. శాహారాన్ని ప్రోత్సాహిస్తూ.. ఈ మధ్య అందరూ వీగన్​గా మారుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన ప్రపంచ వీగన్ డేగా నిర్వహిస్తున్నారు. మరి వీగన్​గా మారితే లాభాలు మాత్రమేనా? నష్టాలు కూడా ఉన్నాయా?
వీగన్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలు, నష్టాలు
వీగన్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలు, నష్టాలు

వీగన్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలు, నష్టాలు

World Vegan Day 2022 : తమ సొంత అవసరాలను తీర్చుకోవడానికి జంతువులపై జరిగే దోపిడీని నిరోధించే లక్ష్యంతో ఏటా నవంబర్ 1న ప్రపంచ వీగన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1994 నుంచి ఈ డేని సెలబ్రేట్ చేయడం ఆనవాయితీగా వచ్చింది. ఇంతకీ వీగన్ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. వీగన్ అంటే శాకాహారిగా ఉంటూ.. మొక్కల ఆధారిత ఫుడ్ తీసుకుంటూ.. మాంసం, లెదర్​తో తయారు చేసే ఉత్పత్తులకు దూరంగా ఉండటమే వీగన్. ఈ మధ్య చాలామంది వీగన్​కు షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఇలా వీగన్​ మారడం వల్ల లాభాలేనా? నష్టాలు కూడా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

లాభాలు

* వీగన్ లేదా శాకాహారి ఆహారాన్ని అనుసరించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ తరహా ఆహారాలు సంతృప్త కొవ్వులో తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా కలిగి ఉంటాయి.

* గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అనేక అధ్యయనాలు శాకాహారాన్ని మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిలకు, మంటను తగ్గించడానికి, గుండె జబ్బుల రేటును తగ్గిస్తాయని నిరూపించాయి.

* బరువు తగ్గాలి అనుకునేవారు వీగన్​గా మారవచ్చు. మాంసాహారం, జంతు ఉత్పత్తులను మినహాయించడం, శాకాహారి ఆహారాన్ని అనుసరించడం వలన మీరు బరువు తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

నష్టాలు

* వీగన్ ఫుడ్ తీసుకునేవారికి ఐరన్ సమస్యలు వచ్చే అవకాశముంది. చాలా మంది శాకాహారులు ఐరన్ లోపంతో రక్తహీనతకు గురవుతున్నారు. మొక్కల ఆధారిత ఆహారాలలో నాన్-హీమ్ ఐరన్ అనే ఐరన్ ఉంటుంది. దీనిని శరీరం తక్కువగా శోషిస్తుంది.

* లీకీ గట్ ప్రమాదాన్ని పెంచుతుంది. లెగ్యూమ్‌లు లెక్టిన్‌లు, ఫైటేల్స్‌తో సహా యాంటీన్యూట్రియెంట్‌లతో నిండి ఉంటాయి. ఇవి పేగు పారగమ్యతను పెంచుతాయి. దీనిని లీకీ గట్ అని కూడా పిలుస్తారు.

* డిప్రెషన్ ప్రమాదం పెరుగుతుంది. అనేక అధ్యయనాలు శాకాహారాన్ని డిప్రెషన్‌లతో ముడిపెట్టాయి. శాకాహారులు డిప్రెషన్ నుంచి ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారు. ఎందుకంటే వారి ఆహారంలో చేపలు లేదా చేప నూనెలలో లభించే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండవు కాబట్టి ఈ సమస్య వస్తుంది అంటున్నారు.

తదుపరి వ్యాసం