Vegan Smoothie | ఈ స్మూతీ కండరాలకు బలమిస్తుంది.. పైగా వీగన్ ఫ్రీ
సమ్మర్లో హైడ్రేట్‌గా ఉండేందుకు కొబ్బరినీరు తీసుకుంటాం. కానీ కొబ్బరిని మాత్రం వదిలేస్తాం. కొందరు దానిని తింటారు కానీ.. మరికొందరు ఆ కొబ్బరిని అలానే పడేస్తారు. అలాంటి వారు కొబ్బరితో ఈ స్మూతీని తయారుచేసుకోండి. ఇది కండరాలకు బలం చేకూర్చుతుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాల బలహీనత చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అలాంటివారు ఈ బలహీనతపై దృష్టిపెట్టాల్సిందే అంటున్నారు నిపుణులు. అందుకే ఈ స్మూతిని మీ ముందుకు తీసుకువచ్చాము. పైగా ఇది పూర్తిగా వీగన్ స్మూతీగా చెప్పవచ్చు. పాలు, పెరుగు వంటివి ఇష్టపడని వారు.. ఈ స్మూతీని చక్కగా తీసుకోవచ్చు. ఇది వీగన్ ఫ్రీ, గ్లూటన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ స్మూతీ. ఇన్ని ఫ్రీలుంటే.. మీరు ఎలా కాదనగలరు. దీనిని బ్రేక్ ఫాస్ట్ లేదా బ్రంచ్ వలె తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీకి కావాల్సిన పదార్థాలెంటో.. తయారీ ఏ విధంగానో చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
* కొబ్బరి - అరకప్పు
* ఓట్స్ - 20 గ్రాములు (నానబెట్టాలి)
* బాదం - 4 (నానబెట్టాలి)
* అరటిపండు - 1
* పుచ్చకాయ గింజలు - అరస్పూన్
* చియా సీడ్స్ - 2 స్పూన్లు (నానబెట్టాలి)
* ఖర్జూరం - 2
తయారీ విధానం
ముందుగా కొబ్బరిని ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలను మిక్సీ జార్లో వేయాలి. దానిలో నానబెట్టిన ఓట్స్ వేయాలి. పుచ్చకాయ గింజలు, ఖర్జూరం, బాదం వేసి స్మూతీ వలె మిక్సీచేసుకోవాలి. ఒక గ్లాసులో నానబెట్టిన చియా సీడ్స్ వేయాలి. అనంతరం స్మూతీ వేసుకోవాలి. నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో గార్నీష్ చేసుకోవాలి. అంతే సింపుల్ అండ్ కండరాలకు బలాన్ని ఇచ్చే స్మూతీ రెడీ.
దీనిలో 435 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ 7.2 గ్రాములు, ఫైబర్ 9.1 గ్రాములు, మంచి కొవ్వులు 19.5 గ్రాములు, కార్బ్స్- 60 గ్రాములు ఉంటాయి. కాబట్టి దీనిని మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఈ స్మూతీ టేస్ట్‌తో పాటు.. మంచి కొవ్వులు, కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్స్, విటమిన్స్ కలిగి ఉంటాయి. పైగా ఇది గ్లూటన్ ఫ్రీ. డెయిరీ ఫ్రీ.
సంబంధిత కథనం