తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World No Tobacco Day: స్మోకింగ్ మానేస్తే నెల రోజుల్లో మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

World No Tobacco Day: స్మోకింగ్ మానేస్తే నెల రోజుల్లో మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే

Haritha Chappa HT Telugu

30 May 2024, 16:30 IST

google News
    • World No Tobacco Day 2024:  మీకు ధూమపానం చేసే అలవాటు ఉందా? వెంటనే మానేయండి. ఇది మీరు ఉత్తమ నిర్ణయాలలో ఒకటి. ఒక నెల రోజులు ధూమపానం మానేసి చూడండి… మీ శరీరంలో వచ్చే సానుకూల మార్పులు గమనించండి.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

పొగాకు వల్ల ఎన్నో అనారోగ్యాలు వచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇవి అకాల మరణానికి కారణం అవుతుంది. ఎన్నో భయంకరమైన వ్యాధుల ప్రమాదాన్ని ఇది కలిగిస్తుంది. పొగాకును మానేయమని చెప్పేందుకు ప్రతి ఏడాది మే 31 న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ధూమపానం నెమ్మదిగా మీ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఇది న్యుమోనియా, క్షయ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

ధూమపానం వల్ల గుండె, రక్తనాళాలు దెబ్బతింటాయని, గుండెజబ్బులు, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాలను పెంచుతుంది. వీటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రజలలో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణం.

ధూమపానం మానేసి ఒక నెల రోజుల పాటూ గమనించి చూడండి… మీ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ధూమపానం మానేయడం వల్ల మీ రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రుచి, వాసనను గ్రహించే శక్తి మెరుగుపరుస్తుంది.

ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

1. మెరుగైన ప్రసరణ: ధూమపానం మానేయడం వల్ల మీ రక్తపోటు, హృదయ స్పందన రేటు సవ్యంగా ఉంటుంది. మీ అవయవాలు, కణజాలాలకు ఎక్కువ ఆక్సిజన్ ను అందిస్తుంది. ఇది శక్తి స్థాయిలను, మొత్తం శక్తిని పెంచుతుంది.

2. ఊపిరితిత్తుల పనితీరు: సిగరెట్ మానేసిన వారం రోజులకే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటం ప్రారంభమవుతుంది. మీ ఊపిరితిత్తులలో చిన్న జుట్టు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని సిలియా అంటారు. ధూమపానం మానేశాక సిలియా సాధారణంగా పనిచేయడం ప్రారంభిస్తాయి .

3. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది: ధూమపానం గుండె, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం మానేశాక గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

4. రుచి, వాసన : ధూమపానం మానేయడం వల్ల రుచి, వాసన గ్రహించే శక్తి పెరుగుతుంది. ఆహారం మంచి రుచిగా అనిపిస్తుంది. ఇది మీ ఆహారాన్ని ఆస్వాదించేలా చేస్తుంది.

5. ఆరోగ్యకరమైన చర్మం: సిగరెట్ తాగడం వల్ల వృద్ధాప్యం త్వరగా వస్తుంది. ముఖంపై ముడతలు పడతాయి. రంగు తగ్గిపోతుంది . ఎప్పుడైతే ధూమపానం మానేస్తారో అప్పుడు మీ చర్మం తనను తాను రిపేర్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఆక్సిజన్, పోషకాలు చర్మానికి ఎక్కువగా చేరుతాయి.

6. బలమైన రోగనిరోధక శక్తి: ధూమపానం రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలకు ఎక్కువగా గురవుతారు. ధూమపానం మానేయడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం అవుతుంది. జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

7. మెరుగైన మానసిక ఆరోగ్యం: ధూమపానం తరచుగా ఒత్తిడి, ఆందోళనకు దారి తీస్తుంది. సిగరెట్ మానేస్తే మెరుగైన మానసిక ఆరోగ్యం దక్కుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

ధూమపానం మానేయడం వల్ల శరీరంలో సానుకూల మార్పులకు దారితీస్తుంది, మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గడం, మెరుగైన మానసిక ఆరోగ్యం వంటివి దక్కుతాయి. నెలరోజుల్లోనే మీ ఆరోగ్యంలో మంచి మార్పులు కనిపిస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం