తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Kidney Day 2024: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏవో తెలుసుకోండి

World Kidney day 2024: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏవో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

13 March 2024, 15:07 IST

google News
    • మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను తినాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలను దూరంగా పెట్టాలి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కిడ్నీల కోసం ఏం తినాలో? ఏమి తినకూడదో తెలుసుకోండి. 
ప్రపంచ కిడ్నీ దినోత్సవం
ప్రపంచ కిడ్నీ దినోత్సవం (Freepik)

ప్రపంచ కిడ్నీ దినోత్సవం

World Kidney day 2024: మన శరీరంలోని కీలకమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వ్యర్థాలు, విషాలను బయటికి పంపించే బాధ్యత కిడ్నీలదే. అవి మన శరీరంలోని సహజ ఫిల్టర్లు. అన్ని అవయవాల మాదిరిగానే, మన మూత్రపిండాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవి హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర నిండిన ఆహారాలు తినడం తగ్గించాలి. డయాబెటిస్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కూడా మూత్రపిండాల సమస్యలు రావచ్చు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

మూత్రపిండాలు వ్యర్థాలను ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది. శరీరం నుండి అదనపు ద్రవాన్ని కిడ్నీలు తొలగిస్తాయి. దీని వల్ల అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని నియంత్రించడానికి, శరీర ద్రవాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మూత్రం రంగు మారిపోతుంది. రాత్రిపూట మూత్రవిసర్జన అధికంగా వస్తుంది. అలసటగా అనిపించడం, కళ్ళ చుట్టూ ఉబ్బడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మీ మూత్రపిండాలను జాగ్రత్తగా ఉండాలంటే సరైన ఆహారం తినాలి. సోడియం, పొటాషియం తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. పోషకాలు నిండిన కూరగాయలు తినడం కిడ్నీలను కాపాడతాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఉప్పు, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదు.

కిడ్నీలకు ఉత్తమ ఆహారాలు

మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. కిడ్నీల కోసం ఎక్కువ శాఖాహారాన్ని తింటే మంచిది. తక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తింటూ ఉండాలి. ఆపిల్, బెర్రీలు, క్యాబేజీ వంటివి అధికంగా తినాలి. సోయా, పప్పుధాన్యాలు, కాటేజ్ చీజ్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను తింటే ఎంతో మంచిది. చేపలు, చికెన్, గుడ్లు వంటి జంతు ప్రోటీన్లను మితంగా తినాలి. బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు తరచూ తింటూ ఉండాలి. ఆలివ్ ఆయిల్, ఆవ నూనె, సోయాబీన్ ఆయిల్ వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

పండ్లు

చాలా పండ్లలో సహజంగా సోడియం, పొటాషియం తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మూత్రపిండాల కోసం ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, పియర్స్, పుచ్చకాయ వంటివి తింటూ ఉండాలి.

బ్రోకలీ, క్యాబేజీ

కిడ్నీ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు వంటివి తరచూ తింటూ ఉండాలి.

పెరుగు, పాలు

కొవ్వు తీసిన పాలను, పెరుగు, చీజ్ వంటివి తింటూ ఉండాలి. వీటిలో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి.

బ్రౌన్ రైస్, ఓట్స్

బ్రౌన్ రైస్, ఓట్స్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. తృణధాన్యాలైన బ్రౌన్ రైస్, క్వినోవా, వోట్స్ వంటివి ప్రతిరోజూ తింటూ ఉండాలి.

చేపలు, బీన్స్

చేపలు, చికెన్, బీన్స్ వంటి వాటిలో లీన్ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల బరువు పెరగరు. ఆరోగ్యానికి చాలా మంచిది.

వీటిని తినకండి

కిడ్నీల కోసం కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా తినకూడదు. అరటి పండ్లు, పుల్లని పండ్లు, బంగాళాదుంపలు, అవకాడోలు వంటివి మూత్ర పిండాల కోసం తినకూడదు. సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తినకూడదు. ఉప్పగా ఉన్న ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది. అలాగే ఊరగాయలు, నిల్వ పచ్చళ్లు వంటి వాటిలో కూడా సోడియం అధికంగా ఉంటుంది. చక్కెర నిండిన పానీయాలు తినకూడదు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి.

ఫాస్పరస్

ఫాస్ఫరస్ అనేది ఒక ఖనిజం, ఇది చాలా ఆహారాలలో సహజంగా లభిస్తుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు ఫాస్పరస్ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాల ఉత్పత్తులు, ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫాస్పరస్ ఉంటుంది.

పొటాషియం

పొటాషియం మరొక ముఖ్యమైన పోషకం, కానీ మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు దీన్ని తక్కువగా తీసుకోవాలి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలలో అరటిపండ్లు, నారింజ, బంగాళాదుంపలు, టమోటాలు ముఖ్యమైనవి. ఈ ఆహారాలు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది.

తదుపరి వ్యాసం