World Creativity Day 2022 | మీ నైపుణ్యాలను ఇలా మెరుగుపరచుకోండి..
21 April 2022, 13:01 IST
- ప్రతి ఒక్కరికి క్రియేటివిటి ఉండాలి. చేసే పనిని క్రియేటివ్‌గా చేయడం వల్ల మనలో నైపుణ్యాలు మెరుగుపడతాయి. నైపుణ్యాలు అనేవి మనం చేసే పనిలోనూ, ఉద్యోగంలోనూ మనకు గుర్తింపును తీసుకువస్తాయి. కాబట్టి వాటిని మెరుగుపరచుకునేందుకు మనం ప్రయత్నించాలి. క్రియేటివ్ లెవల్స్‌ను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వరల్డ్ క్రియేటివిటీ డే
జీవితంలో సృజనాత్మకత అనేది చాలా ఉపయోగకరమైన నైపుణ్యం. మీ స్నేహితులతో గేమ్‌లు ఆడుతున్నప్పుడు, ఏదైనా కొత్త పనిని చేస్తున్నప్పుడు, ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడు మనలోని సృజనాత్మకత బయటకు వస్తుంది. కొన్ని సందర్భాలలో ఏదైనా పనిని భిన్నంగా చేయడం వల్ల కూడా మనలోని నైపుణ్యం పెరుగుతుంది. అలానే క్రియేటివిటీ అనేది కెరీర్లో ముందుకు వెళ్లేందుకు సహాయం చేస్తుంది. ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో నెగ్గుకు రావాలంటే.. క్రియేటివిటీ కచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి మనలోని నైపుణ్యాలను నిరంతరం పెంచుకునేందుకు ప్రయత్నించాలి అంటున్నారు నిపుణలు. మనకి కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.
నేర్చుకుంటూ ఉండండి
సృజనాత్మకత అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. కాబట్టి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండటానికి ప్రయత్నించండి. ప్రపంచం గురించి, మన చుట్టూ జరిగే వాటి గురించి తెలుసుకోవడానికి ఉత్సుకతను కలిగి ఉండాలి. దీనివల్ల మనకు తెలియకుండానే నైపుణ్యాలు పెరిగే అవకాశముంది. కొన్ని సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందించుకున్న తర్వాత.. ఆగిపోకుండా.. మిమ్మల్ని మీరు సవాలు చేసుకుంటూనే ఉండాలి. ఖాళీ సమయాల్లో మరింత చదవడానికి ప్రయత్నించినా, లేదా ఏవైనా కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నించినా మంచిదే.
మీరు ఇష్టపడేదాన్ని చేయండి
మీరు మీ ఉద్యోగాన్ని నిజంగా ఇష్టపడినప్పుడు.. సహజంగానే సృజనాత్మక, సమస్య పరిష్కారం, కొత్త ఆలోచనలతో ముందుకు రావడం అనేవి ప్రేరణ, ఉత్సాహంతో ఉంటారు. వాయిద్యం వాయించడం, పెయింటింగ్ చేయడం, క్రీడలు వంటి వాటిలో వేటిలో ఆసక్తి ఉందో తెలుసుకోండి. దానిలో రాణించండి.
విరామం తీసుకోండి
సృజనాత్మకత అనేది ఖచ్చితంగా నైపుణ్యం అయినప్పటికీ.. మీరు మెరుగ్గా ఉండటానికి కాస్త విరామం కూడా తీసుకోవచ్చు. ఎక్కువ ఒత్తిడిని పెట్టుకోకుండా ఉండేందుకు.. కాస్త విరామం అనేది ముఖ్యం. కొత్త ఆలోచనలు, పరిష్కారాలను వెతుక్కుంటూ.. గంటల తరబడి మీ పనిలోనే నిమగ్నమైతే.. కాస్త విరామం తీసుకోండి. ఆ సమయంలో పనికి సంబంధించిన ఆలోచనలను మనసు నుంచి తీసివేయండి. ప్రశాంతంగా ఉండండి.
వ్యాయామం చేయండి
ఒత్తిడికి లోనవుతున్నప్పుడు మీ మనసును క్లియర్ చేయడానికి వ్యాయామం ఒక గొప్ప మార్గం. అనేక అధ్యయనాలు కూడా శారీరక వ్యాయామం మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిరూపించింది.
ఇవి ప్రయత్నించండి.
కొందరు తెల్లవారుజామునే.. అత్యంత సృజనాత్మకంగా, ఉత్పాదకతను కలిగి ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. మీకు ఏ పని పరిస్థితులు ఉత్తమంగా పని చేస్తాయో కనుగొనడం కీలకం. మీరు పని వేళలే కాకుండా.. స్థానం, లైటింగ్, సంగీతం (లేదా నిశ్శబ్దం!), మీరు ఉపయోగించే సాధనాలు/పరికరాలు వంటి ఇతర అంశాలు కూడా కీలకమే. మీ సహోద్యోగులకు సహకరించడం వల్ల కూడా మీలో సృజనాత్మకత పెరుగుతుంది. వారితో జరిగే సంభాషణలు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆలోచించేలా చేస్తాయి.
టాపిక్