తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss: రోజుకు ఒక్కసారే తిని 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇది పని చేస్తుందా.. రిస్కా?

Weight Loss: రోజుకు ఒక్కసారే తిని 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇది పని చేస్తుందా.. రిస్కా?

26 November 2024, 8:30 IST

google News
    • Weight Loss: ఓ మహిళ రోజుకు ఒక్కసారి మాత్రమే తింటూ 22 కేజీల బరువు తగ్గారు. ఆ ఒక్క పూట ఏం తిన్నారో చెప్పారు. దీంతోపాటు ఈ తీవ్రమైన ఫాస్టింగ్ డైట్ వల్ల కలిగే లాభాలు ఏంటి.. రిస్క్ ఏంటో ఇక్కడ చూడండి.
Weight Loss: రోజుకు ఒక్కసారే తిని 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇది పని చేస్తుందా.. రిస్కా?
Weight Loss: రోజుకు ఒక్కసారే తిని 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇది పని చేస్తుందా.. రిస్కా?

Weight Loss: రోజుకు ఒక్కసారే తిని 4 నెలల్లో 22 కేజీల బరువు తగ్గిన మహిళ.. ఇది పని చేస్తుందా.. రిస్కా?

త్వరగా బరువు తగ్గాలని కొందరు కఠిమైన పద్ధతులు పాటిస్తుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల రోజుకు ఒక్కసారి మాత్రమే తినే వన్ మీట్ ఎ డే (ఓఎంఏడీ) పాపులర్ అవుతోంది. ఇంటర్మెటింట్ ఫాస్టింగ్‍లో ఇది కఠినమైన పద్ధతి. అయితే, రోజులో ఒక్క పూట తినే ఈ పద్ధతి ఫాలో అయి తాను నాలుగు నెలల్లో 22 కేజీల బరువు తగ్గానని వినో అనే ఓ మహిళ వెల్లడించారు.

97 కేజీల నుంచి 76 కేజీలకు..

ఓఎంఏడీ డైట్ పాటించి నాలుగు 4 నెలల్లో 21 కేజీలు తగ్గానని ఇన్‍స్టాగ్రామ్‍లో వినో వెల్లడించారు. “132వ రోజు నా ఓఎంఏడీ డైట్ - 97 కేజీల నుంచి 76 కేజీలు” అంటూ ఓ వీడియో కూడా తాజాగా పోస్ట్ చేశారు. తాను ఆ ఒక్కపూట ఏం తింటున్నానో వెల్లడించారు.

ఏం తింటున్నారంటే..

తాను ఈ ఏడాది జూన్ 2024లో ఓఎంఏడీ డైట్ మొదలుపెట్టానని వినో వెల్లడించారు. ఏం తీసుకుంటున్నారో చెప్పారు. “నేను పరగడుపున జీలకర్ర, దాల్చిన చెక్క నీరు తాగుతా. ఆరోగ్యకరమైన స్నాక్ (వాల్‍నట్స్) తిని సాయంత్రం 5 గంటలకు తిని ఫాస్టింగ్ బ్రేక్ చేస్తా. సాయంత్రం 5.30 గంటలకు బ్యాలెన్స్డ్ డైట్ (అన్నంతో కూరగాయల కుర్మా, సొరకాయ కర్రీ, బెండకాయ, పన్నీర్, పనియారం) తింటా. 6 గంటలకు కొన్ని పండ్లు (దానిమ్మ) తీసుకుంటా” అని వినో వెల్లడించారు. ఈ డైట్‍తో పాటు ప్రతీ రోజు తాను ఓ గంట స్ట్రెంథ్ ట్రైనింగ్, 20వేల అడుగులు నడుస్తానని పేర్కొన్నారు. ఇలా రోజులో ఒకేసారి పూర్తిస్థాయి భోజనం చేస్తానని, రోజులో గంట మాత్రమే ఆహారం తీసుకుంటానని వెల్లడించారు.

ఈ డైట్ లాభాలు, రిస్క్‌లు ఇవే

రోజులో ఒకే మీల్ తీసుకునే ఈ డైట్ గురించి ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాకేశ్ గుప్తా స్పందించారు. రోజులో ఒక గంట మాత్రమే ఆహారం తీసుకొని.. 23 గంటలు ఫాస్టింగ్ చేయడమే ఈ డైట్ అని అన్నారు. రోజు మొత్తానికి కావాల్సిన క్యాలరీలను ఒక్క మీల్‍లోనే తీసుకుంటారని అన్నారు. “ఈ డైట్ వల్ల తీవ్రమైన క్యాలరీల లోపం కలుగుతుంది. అందుకే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కసారి తింటే చాలా వెరైటీలు తీసుకోవాలనే వాదన ఉంది” అని అన్నారు.

వేగంగా వెయిట్ లాస్ : ఓఎంఏడీ డైట్ వల్ల త్వరగా బరువు తగ్గొచ్చని. శరీరంలో ఫ్యాట్ ఎక్కువగా కరుగుతుందని డాక్టర్ రాకేశ్ చెప్పారు. జీవక్రియ కూడా మెరుగై వాపుల్లాంటి తగ్గుతాయన్నారు.

ప్లానింగ్ సింపుల్: రోజుకు ఓకేసారి తినడం వల్ల డైట్ ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుందని తెలిపారు. క్యాలరీలను లెక్కేసుకునే అవసరం ఉండదని చెప్పారు.

చాలా రకాలు తినొచ్చు: రోజులో ఒకేసారి భోజనం చేస్తే అందులో చాలా రకాలు తినొచ్చని, ఆ విషయంలో ఆంక్షలు విధించుకోవాల్సిన అవసరం ఉండదని డాక్టర్ రాజేశ్ చెప్పారు.

రిస్క్‌లు ఇవే

పోషకాల లోపం: రోజులో ఒకేసారి భోజనం చేయడం వల్ల శరీరంలో పోషకాల లోపం వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ రాకేశ్ వెల్లడించారు. దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని అన్నారు.

తీవ్రమైన ఆకలి: రోజులో ఒకేసారి తినే పద్ధతిని పాటించే వారికి తీవ్రమైన ఆకలి ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల కష్టంగా అనిపిస్తుందన్నారు. చిరాకు వచ్చి సింగిల్ మీట్‍లో మరీ ఎక్కువగా తినే అవకాశం ఉంటుందని తెలిపారు.

మజిల్ లాస్, నీరసం: రోజులో ఒకసారి తినడం వల్ల కొవ్వే కాకుండా శరీరంలో కండ కూడా తగ్గే రిస్క్ ఉంటుందని రాకేశ్ వెల్లడించారు. మజిల్ లాస్ ఉంటుందని, శరీరంలో శక్తి తగ్గే అవకాశం ఉందన్నారు. నీరసంగా కూడా అనిపిస్తుందని చెప్పారు.

ఈ డైట్ చేయాలంటే ముందుగా..

ఒకవేళ ఓఎంఓడీ డైట్ చేయాలంటే ముందుగా దీనివల్ల ప్రయోజనాలు, రిస్కులను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎక్కువ కాలం ఈ డైట్ పాటిస్తే శరీరంలో పోషకాలు లోపం వచ్చి.. ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ఈ డైట్ పాటించాలనుకుంటే ముందుగా ఓ హెల్త్ కేర్ ప్రొఫెషనల్‍ను సంప్రదించి సలహాలు తీసుకోవాలని డాక్టర్ రాకేశ్ సూచించారు. సాధారణంగా తింటూనే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

తదుపరి వ్యాసం