Christmas 2024: క్రిస్మస్ పండుగను ప్రతి ఏటా డిసెంబర్ 25నే ఎందుకు నిర్వహించుకుంటారు?
23 December 2024, 11:00 IST
Christmas 2024: ప్రతి ఏటా డిసెంబర్ 25నే క్రిస్‌మస్ పండుగను నిర్వహించుకుంటారు. మిగతా పండుగల్లా ఇది ఏడాదికో రోజున రాకుండా ఒకే తేదీన ఎందుకు ఫిక్స్ అయింది. ఏటా అదే తేదీన క్రిస్మస్ ఎందుకు నిర్వహించుకోవాలి?
క్రిస్మస్ 2024
క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా వేడుకగా జరిగే పండుగ. క్రైస్తవ సోదరులు ఎంతో ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. ఏడాదంతా ఈ పండు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. క్రైస్తవుల ప్రకారం, దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్ మస్ గా నిర్వహించుకుంటారు. ఏటా డిసెంబర్ 25నే ఈ పండుగ వస్తుంది. ఈ పవిత్ర దినం ప్రేమ, క్షమాగుణం, కరుణ అతని బోధనలను గుర్తు చేస్తుంది. ఈ పండుగ రోజు క్రిస్మస్ కరోల్స్ పాడటం నుండి క్రిస్మస్ చెట్టును అలంకరించడం వరకు అనేక కార్యక్రమాలు ఉంటాయి. క్రిస్మస్ క్రైస్తవ సోదరుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పండుగను ప్రతి ఏటా డిసెంబర్ 25న ఎందుకు నిర్వహించుకుంటారు?
క్రిస్మస్ చరిత్ర
యేసుక్రీస్తు పుట్టిన తేదీని బైబిలు సరిగ్గా పేర్కొనలేదు. నిర్దిష్ట తేదీ లేదా నెల గురించి కూడా అది చెప్పలేదు. ఈ విషయం చాలా అస్పష్టంగా ఉంది. మొదట్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను, జీసెస్ క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని (ఈస్టర్) గురించి బైబిలులో పెద్దగా ప్రస్తావించలేదు. బైబిలు ఒక వేదాంతశాస్త్ర రచనగా ఉంది. అది జీసెస్ క్రీస్తు బోధలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. క్రీస్తు మరణించిన శతాబ్దాల తరువాత ఆయన జన్మదిన వేడుకలు అధికారికంగా చేయడం ప్రారంభించినట్టు తెలుస్తోంది. కొన్ని అంచనాలను బట్టి డిసెంబర్ 25న క్రిస్మస్ చేయడం ఎందుకు ప్రారంభించారో చరిత్రకారులు వివరిస్తున్నారు.
పురాతన రోమ్‌లో భిన్నమైన క్యాలెండర్‌ను ఉపయోగించేవారు. రోమన్లు శీతాకాలం ముగింపు, సూర్యుడి పునరుజ్జీవనాన్ని నిర్వహించుకనే నటాలిస్ సోలిస్ ఇన్విక్ట'స్ (సూర్యుని జన్మదినం) ను నిర్వహించుకుంటారు. ఇది రోమన్ దేవుడైన సూర్యుడి 'పునర్జన్మ'ను సూచిస్తాయి. సూర్యుడంటే వెలుగు. యేసును 'లోకపు వెలుగు'గా అభివర్ణిస్తూ, సూర్యుని ‘పునర్జన్మ’ వేడుకకు అనుగుణంగా ప్రారంభ క్రైస్తవులు డిసెంబర్ 25 ను ఎంచుకుని ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు.
క్రిస్మస్ ప్రాముఖ్యత
యేసుక్రీస్తు జన్మదినాన్ని నిర్వహించుకోవడం వల్ల కుటుంబంతో బంధం పెరిగిపోతుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, కలిసి భోజనం తయారు చేయడం వంటివి చేస్తారు. క్రైస్తవులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకునే పండుగ.
క్రిస్టమస్ పండుగను ఏసుక్రీస్తు పుట్టుకకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నిర్వహించుకుంటారు. క్రిస్మస్ రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. తీ వైజ్ మెన్ అనేక ఒక బైబిల్ కథ. ఈ కథలో స్నేహితులు, కుటుంబసభ్యులతో బహుమతులు ఇచ్చుకునే సంప్రదాయం ఏర్పడింది. క్రిస్మస్ అనే పేరు ‘మాస్ ఆఫ్ క్రైస్ట్’ అనే పదం నుంచి వచ్చింది. ఈ పండుగ రోజు క్రైస్తవులంతా ఏసు త్యాగాలను గుర్తుచేసుకుంటారు.
క్రిస్మస్ పండుగను డిసెంబర్ 25న తొలిసారి క్రీ.శ 336లో నిర్వహించుకున్నారు. రోమన్ చక్రవర్తి కాన్ స్టాంటైన్ కాలంలో రోమన్ చర్చిలో క్రిస్మస్ తొలిసారిగా చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఇక ఇది సెలవు దినంగా మారింది మాత్రం క్రీస్తు పూర్వం 529లో. పోప్ జూలియస్ 1 క్రిస్మస్ పండుగను సెలవు దినంగా ప్రకటించారు. క్రిస్మస్ నుంచి 12 రోజుల పాటూ పండుగను నిర్వహించుకుంటారు. జనవరి 5 వరకు ఈ పండుగను చేసుకుంటారు.
టాపిక్