తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Christmas Tree: క్రిస్మస్ ట్రీని ఎందుకు అలంకరించాలి? తొలి క్రిస్మస్ చెట్టును ఎప్పుడు పెట్టారంటే

Christmas Tree: క్రిస్మస్ ట్రీని ఎందుకు అలంకరించాలి? తొలి క్రిస్మస్ చెట్టును ఎప్పుడు పెట్టారంటే

Haritha Chappa HT Telugu

23 December 2024, 7:30 IST

google News
    • Christmas Tree: ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న యేసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటరు. దీన్నే క్రిస్ మస్ అంటారు. ఆ రోజు ప్రతి క్రైస్తవ సోదరుడు తమ ఇంటి ముందు లేదా లోపల క్రిస్మస్ ట్రీని అలంకరించి పెడతారు. ఇలా ఎప్పటి నుంచి క్రిస్మస్ ట్రీని పెట్టడం మొదలైందో తెలుసా?
క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ ట్రీ

క్రిస్మస్ ట్రీ

ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. క్రైస్తవ సోదరులు ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఏడాదంతా ఎదురుచూస్తారు. వారు నిర్వహించుకునే అతిపెద్ద పండుగ ఇదే. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను నిర్వహించుకుంటారు. నమ్మకాల ప్రకారం యేసుక్రీస్తు ఈ రోజున జన్మించాడని చెప్పుకుంటారు. ఈ పండుగ వివిధ ప్రదేశాలలో వివిధ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం నిర్వహిస్తారు. 

క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ ట్రీని అలంకరించే సంప్రదాయం కూడా ఉంది. ఈ రోజున ఇంటిని రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. అలాగే క్రిస్మస్ ట్రీని కూడా చూడముచ్చటగా అలంకరిస్తారు. బంధుమిత్రులకు బహుమతులు ఇస్తారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున క్రిస్మస్ చెట్టు అలంకరణ మాత్రం చూడముచ్చటగా ఉంటుంది. 

క్రిస్మస్ ట్రీ చరిత్ర

పండుగల సమయంలో గ్రీకులు, రోమన్లు తమ ఇళ్లలో క్రిస్‌మస్ చెట్లను అలంకరించే ఆచారాన్ని మొదట ప్రవేశపెట్టారని చెబుతారు. వారు శీతాకాలం మధ్యలో డిసెంబర్ 21 న పండుగను నిర్వహించుకనేవారు. యూరోపియన్లు కూడా శీతాకాలపు పండుగలను చేసుకునేవారు. వారు ఎప్పుడూ పచ్చని చెట్లతో ఇళ్లను అలంకరించడం ద్వారా పండుగను చేసుకునేవారు.

అలాగే క్రిస్మస్ పండుగకు  కూడా క్రిస్మస్ చెట్లను ఇళ్లలో నాటడం మొదలుపెట్టారు. రంగురంగుల బొమ్మలు, గంటలు, టాఫీలు, రిబ్బన్లు, లైట్లతో అలంకరిస్తారు. నమ్మకాల ప్రకారం, 16 వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ సంస్కర్త మార్టిన్ లూథర్ క్రిస్మస్ చెట్టును అలంకరించడం ప్రారంభించాడని చెప్పుకుంటారు. ఒక కథనం ప్రకారం మార్టిన్ లూథర్ డిసెంబర్ 24 సాయంత్రం అడవి గుండా అలా నడుచుకుంటూ వెళుతున్నాడు. అది మంచుతో కప్పిన అడవి. మార్టిన్ లూథర్ అడవిలో ఒక సతత హరిత వృక్షాన్ని చూశాడు. వెన్నెల దాని కొమ్మల మీద పడుతోంది. ఆ చెట్టును వేళ్లతో సహా పెకిలించి తెచ్చి తన ఇంట్లోని పెద్ద కుండీల్లో పాతాడు. ఆ చెట్టును క్రిస్ మస్ సందర్భంగా  అలంకరించారు. అది చూసిన చుట్టు పక్కల వారికి ఆ చెట్టు ఎంతో నచ్చింది. వారు కూడా అలాగే చేయడం ప్రారంభించారు. అది కొన్నేళ్లకు సంప్రదాయంగా మారిపోయింది.   యేసుక్రీస్తు జన్మదినం రోజూ పచ్చని చెట్టును అలంకరించడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. 

మిరాకిల్ ట్రీ

క్రిస్మస్ ట్రీ గురించి మరో ప్రసిద్ధ కథ ప్రచారంలో ఉంది. క్రీ.శ.722 లో జర్మనీలో క్రిస్మస్ చెట్టును అలంకరించే ఆచారం ప్రారంభమైందని అంటారు. ఒకసారి జర్మనీలోని సెయింట్ బోనిఫేస్ కు ఒక పెద్ద ఓక్ చెట్టు కింద కొందరు పిల్లలను బలి ఇచ్చారని చెప్పుకునేవారు. ఇది తెలిశాక సెయింట్ బోనిఫేస్ పిల్లలను రక్షించడానికి ఆ ఓక్ చెట్టును నరికేశాడు. సెయింట్ బోనిఫేస్ నరికిన చెట్టు స్థానంలో ఒక అందమైన చెట్టు పెరిగిందని చెబుతారు. ప్రజలు ఈ చెట్టును అద్బుతమైన చెట్టుగా పిలుచుకునేవారు. ఇది ఒక దివ్య వృక్షమని, దాని కొమ్మలు స్వర్గానికి చిహ్నమని సెయింట్ బోనిఫేస్ ప్రజలకు చెప్పాడు. నమ్మకాల ప్రకారం, ఆ రోజు నుండి వారు యేసుక్రీస్తు పుట్టిన రోజున క్రిస్మస్ చెట్టును అలంకరించడం ప్రారంభించారు.  కథల విషయం ఎలా ఉన్నా క్రిస్ మస్ రోజు క్రిస్మస్ ట్రీ పెడితే వచ్చే పండుగ కళే వేరు.

 

తదుపరి వ్యాసం