తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exam Fear In Kids: పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారా? ఇలా చేసి భయం పోగొట్టండి

Exam fear in kids: పిల్లలు ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారా? ఇలా చేసి భయం పోగొట్టండి

31 August 2024, 17:00 IST

google News
  • Exam fear in kids: పరీక్షలంటే అందరికీ ఎంతో కొంత భయం ఉంటుంది. కానీ, కొంతమందికి ఎగ్జామ్స్ అంటే విపరీతమైన భయం ఏర్పుడుతుంది. దాన్నే ఎగ్జామ్ ఫియర్ అంటాం. దాన్నెలా పోగోట్టాలో, కారణాలేంటో చూసేయండి. 

పిల్లల్లో పరీక్షల భయం
పిల్లల్లో పరీక్షల భయం (freepik)

పిల్లల్లో పరీక్షల భయం

పరీక్ష ముందు రోజు, పరీక్ష రోజు కొంతమంది పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. తరచూ బాత్రూం వెళ్తారు. భోజనం సరిగ్గా చేయరు. నిద్ర అస్సలే పోరు. కాస్త హడావుడిగా, భయంతో కనిపిస్తుంటాంరు. కొంతమందితో కడుపునొప్పి, తలనొప్పి కూడా వస్తాయి. కొందరికి ప్రశ్నపత్రం చూడగానే ఏమీ గుర్తురాదు. అన్నీ మర్చిపోతారు. ఈ లక్షణాలన్నీ తీసి పడేసేవి కాదు. ఇవన్నీ ఎగ్జామ్ ఫియర్ (Exam Fear) సంకేతాలు. అంటే పరీక్షంటే వాళ్లకున్న భయం వల్ల ప్రవర్తనలో ఈ మార్పులన్నీ వస్తాయన్నమాట. దానికి కారణాలేంటో, దాన్ని పిల్లల నుంచి ఎలా పోగొట్టాలో తెల్సుకోండి.

ఎగ్జామ్ ఫియర్ ఎందుకు వస్తుంది?

1. పరీక్షకు సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల..

2. మంచి గ్రేడ్లు, ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం వల్ల

3. మార్కులు బాగా రాకపోతే తల్లి దండ్రులు మందలిస్తారనే భయం వల్ల

4. వాళ్ల స్థాయికి మించి వాళ్లనుంచి ఆశించడం వల్ల

5. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, వాళ్లమీద వాళ్లకు నమ్మకం లేకపోవడం వల్ల.

6. ఇది వరకటి ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవ్వడం, మంచి మార్కులు రాకపోవడం వల్ల

పిల్లల్లో ఎగ్జామ్ ఫియర్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి?

1. ప్రిపరేషన్:

పిల్లలు బాగా చదువుకునేలా ఇంట్లో వాతావారణం ఉండాలి. వాళ్ల చదువుకునే వేళల గురించి ఒక షెడ్యూల్ ఫిక్స్ చేయండి. దాన్ని తప్పకుండా పాటించేలా చూడండి. ఇంట్లో టీవీ కట్టేయండి. పెద్ద సౌండ్లున్న మ్యూజిక్ లాంటివి పెట్టకూడదు. వాళ్లు చదువుకునే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా ఏర్పాటు చేయండి. దాంతో ముందుగానే సంసిద్ధంగా ఉంటారు కాబట్టి పరీక్షంటే భయపడరు.

2. విరామం అవసరం:

ఎప్పుడూ పుస్తకాలకే అతుక్కుని ఉండాలని షరతు పెడితే అది వాళ్లకి ఏ మేలూ చేయదు. మధ్య మధ్యలో బయటకు తీసుకెళ్లడం, కాసేపు ఆటలు ఆడుకోనివ్వడం, మధ్యలో కాసేపు పడుకునేలా చూడటం చాలా ముఖ్యం. వీటివల్ల పిల్లల మెదడు పదును అవుతుంది.

3. సిలబస్ షెడ్యూల్:

పిల్లలు ఒకేసారి మొత్తం సిలబస్ చూసి భయపడిపోతారు. అందుకే వాటిని ఎలా చదవడం పూర్తిచేయాలో ఒక షెడ్యూల్ వేసి ఇవ్వండి. వీలైతే దీనికోసం వాళ్ల టీచర్ సలహా తీసుకోండి. అన్నీ సరిగ్గా చదువుతే పరీక్ష ఎప్పుడు రాయాలా అని ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెడతారు.

4. ఒత్తిడి:

మీ పిల్లల మార్కులను వేరే వాళ్లతో పోల్చకండి. ముఖ్యంగా వాళ్ల ముందు అలా పోల్చి మాట్లాడితే వాళ్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. పక్కవాళ్ల కన్నా వాళ్లు తక్కువ అనే అభిప్రాయానికి వస్తారు. అలాగే వాళ్ల మీద గ్రేడ్ల కోసం ఒత్తిడి పెట్టకండి. అన్ని విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించండి కానీ, ఎప్పుడూ మార్కుల కోసమే చదవాలి అని వాళ్లకు నేర్పకండి. ఏ ర్యాంకు, గ్రేడు వచ్చినా మెచ్చుకోండి. అరె.. పోయిన సారి కన్నా ఈసారి బాగా మెరుగయ్యావే.. తర్వాత సారి పరీక్షలో ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి చూడూ.. అంటూ వాళ్లను ప్రోత్సహించండి.

టాపిక్

తదుపరి వ్యాసం