తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hearing Loss From Headphones: ఈ 2 తప్పులు చేస్తున్నారా? మీ చెవులు పోతాయి

Hearing loss from headphones: ఈ 2 తప్పులు చేస్తున్నారా? మీ చెవులు పోతాయి

HT Telugu Desk HT Telugu

16 November 2022, 10:50 IST

    • hearing loss from headphones: హెడ్‌ఫోన్స్ వాడుతున్నారా? నైట్‌క్లబ్స్ వెళుతున్నారా? మీ చెవులు పోతాయని చెబుతోంది డబ్ల్యూహెచ్‌వో నేతృత్వంలో సాగిన ఓ అధ్యయనం.
హెడ్‌ఫోన్స్ ద్వారా, నైట్ క్లబ్బుల్లో భారీ సౌండ్ కారణంగా చెవులు పోతాయని తేల్చిన స్టడీ
హెడ్‌ఫోన్స్ ద్వారా, నైట్ క్లబ్బుల్లో భారీ సౌండ్ కారణంగా చెవులు పోతాయని తేల్చిన స్టడీ (AP)

హెడ్‌ఫోన్స్ ద్వారా, నైట్ క్లబ్బుల్లో భారీ సౌండ్ కారణంగా చెవులు పోతాయని తేల్చిన స్టడీ

హెడ్‌ఫోన్స్ ద్వారా శబ్ధాలు వినడం, అలాగే లౌడ్ మ్యూజిక్ వినిపించే పబ్‌లు, ఇతర వేదికల వద్ద వినిపించే శబ్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది యువతీయువకులు వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తేల్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నేతృత్వం వహించిన ఈ అధ్యయనం ప్రమాదాన్ని పసిగట్టి యువతను హెచ్చరించింది. వినడానికి సంబంధించిన అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తోంది. అలాగే ప్రభుత్వాలు, తయారీదారులు ఈ విషయంలో భవిష్యత్తులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలిన కోరుతోంది.

బీఎంజే గ్లోబల్ హెల్త్ జర్నల్ అధ్యయనం

బీజేజే గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ఒక విశ్లేషణ ప్రచురితమైంది. ఇంగ్లీషు, స్పానిష్, ఫ్రెంచ్, రష్యన్ తదితర భాషల్లో గడిచిన 2 దశాబ్ధాల్లో సాగిన 33 అధ్యయనాలను ఇది విశ్లేషించింది. ఈ అధ్యయనాల్లో సుమారు 19 వేల మంది 12 నుంచి 34 ఏళ్ల వయస్సున్న వారు పాల్గొన్నారు.

స్మార్ట్ ఫోన్స్, ఇతర ఉపకరణాల ద్వారా సంగీతం, పాటలు వింటున్న యువకుల్లో 24 శాతం మంది సురక్షితం కాని పద్ధతులను పాటిస్తున్నారని ఈ అధ్యయనం తేల్చింది.

48 శాతం మంది కచేరీలు, నైట్‌క్లబ్‌లు వంటి ఎంటర్‌టైన్మెంట్ వేదికల వద్ద సురక్షితం కాని స్థాయిల్లో శబ్ధాలను వింటున్నారని ఈ అధ్యయనం తేల్చింది.

ఈ అధ్యయనాల ద్వారా ఒక అంచనాకు వచ్చింది. సుమారు 6.7 లక్షల నుంచి 135 కోట్ల మంది యువతీయువకులు వినికిడి సమస్యకు లోనయ్యే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ అంచనా చాలా విస్తృత శ్రేణిలో ఉండడానికి కారణాలను కూడా చెప్పింది. కొంతమంది యువకులు అటు హెడ్ ఫోన్స్, ఇటు అధిక ధ్వని స్థాయిల ప్రభావానికి గురవుతూ ఉంటారని సౌత్ కరోలినా మెడికల్ యూనివర్శిటీ ఆడియోలజిస్ట్ లారెన్ డిలార్డ్ వివరించారు.

హెడ్ ఫోన్స్ కారణంగా చెవుడు రాకుండా ఉండాలంటే వారు వాల్యూమ్ తక్కువ పెట్టుకోవడంతో పాటు కొద్దిసేపు మాత్రమే వినాలి. ఎక్కువ సేపు కొనసాగిస్తే తీవ్రమైన రిస్క్ ఎదుర్కొంటారు. ‘దురదృష్ణవశాత్తూ ప్రజలు ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వినడాన్ని ఇష్టపడతారు..’ అని ఆమె అన్నారు. అయితే ఇది జీవితంపై పెను ప్రభావం చూపిస్తుందని కూడా హెచ్చరించారు.

హెడ్‌ఫోన్ వినియోగించే వారు సెటింగ్స్ సరిగ్గా వాడాలని, లేదా సౌండ్ లెవెల్స్ మానిటర్ చేసేలా స్మార్ట్‌ఫోన్లపై ఉండే యాప్స్ వాడాలని డిలార్డ్ సూచించారు.

భారీ శబ్దాలతో కూడిన వాతావరణంలో నాయిస్ క్యాన్సలింగ్ హెడ్‌ఫోన్స్ కాస్త సాయపడతాయి. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ తగ్గించి మ్యూజిక్ మాత్రమే వినిపించేలా పనిచేస్తాయి..’ అని ఆమె వివరించారు.

నైట్ క్లబ్స్, కాన్సర్ట్స్ వంటి చోట్ల భారీ శబ్ధాలు వినిపిస్తాయి. ఈ సమయాల్లో ఇయర్ ప్లగ్స్ వాడడం మేలని ఆమె సూచిస్తున్నారు. ‘స్పీకర్ల ముందు నిలబడడం సరదాగా ఉండొచ్చు.. కానీ ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిది కాదు..’ అని వివరించారు.

‘ఈ ప్రవర్తనలు, ఈ శబ్ధాల తాకిడి కాలక్రమేణా మీ జీవితంపై పెను ప్రమాదం చూపుతాయి. 67 ఏళ్ల వయస్సు వచ్చేసరికి ప్రభావం తీవ్రమవుతుంది..’ అని వివరించారు.

ప్రభుత్వాలు, కంపెనీలకు సూచనలు

సురక్షిత వినికిడి పద్ధతులపై ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా చూడాలి. ముఖ్యంగా నైట్ క్లబ్స్, కాన్సర్ట్స్, లైవ్ షోలు తదితర వేదికల వద్ద పరిమితి శబ్ధాలు ఉండేలా నిబంధనలు అమలు చేయాలని సూచించారు.

కంపెనీలు కూడా ఫోన్లు, ఇతర పరికరాలు తయారుచేసేటప్పుడు యూజర్లను తగు విధంగా హెచ్చరించాలి. ఎక్కువ శబ్ధం వింటే మీ చెవులు పోతాయని హెచ్చరికలు జారీచేయాలని సూచించారు. ఎక్కువ వాల్యూమ్ పెట్టకుండా పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్స్ కూడా ఉండాలని సూచించారు.

43 కోట్ల మంది ప్రజలు.. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు 5 శాతం వినికిడి సమస్యలతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2050 నాటికి ఇది 70 కోట్లకు చేరుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం