తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yogasana For Cholesterol : కొలెస్ట్రాల్ తగ్గించే యోగాసనాలు.. రిజల్ట్ తప్పకుండా ఉంటుంది

Yogasana For Cholesterol : కొలెస్ట్రాల్ తగ్గించే యోగాసనాలు.. రిజల్ట్ తప్పకుండా ఉంటుంది

Anand Sai HT Telugu

04 February 2024, 5:30 IST

    • High Cholesterol Reduce Yogasana : యోగాసనాలు చేయడం మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ద్వారా కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చు. ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.
 కొలెస్ట్రాల్ తగ్గించేందుకు యోగాసనాలు
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు యోగాసనాలు (Unsplash)

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు యోగాసనాలు

ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ సమస్య అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి బయటపడేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కొలెస్ట్రాల్ చాలా మందికి సమస్యగా మారింది. మన అలవాట్లే కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణం. శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగితే అనేక అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. దీని వల్ల గుండె రక్తనాళాలు మూసుకుపోయి గుండెపోటు వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో చాలా సహాయపడే కొన్ని యోగా భంగిమలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

కపాలభాతి ప్రాణాయామం

కపాలభాతి ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణకు కూడా చాలా సహాయపడుతుంది. ఈ వ్యాయామం చేయడానికి ధ్యాన భంగిమలో కూర్చుని, ఆపై 10-15 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ యోగాసనం ద్వారా శరీరానికి చాలా ప్రయోజనాలు దొరుకుతాయి.

ఊర్ధ్వ ధనురాసనం

ఊర్ధ్వ ధనురాసనం చేయడం వల్ల జీర్ణశక్తికి చాలా మంచిది. ఈ ఆసనాన్ని ఊర్ధ్వ ధనురాసన లేదా త్రయంగ ముఖోత్తనాసన అని కూడా అంటారు. ప్రారంభంలో ఈ ఆసనం చేసేటప్పుడు గోడ దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే గోడ మద్దతు చక్రంలా వంగి ఉన్నప్పుడు మీరు లేవడానికి సహాయపడుతుంది. కాసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత గోడకు దూరంగా వెళ్లి సాధన చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వెన్ను ఎముక బలపడుతుంది. ఈ ఆసనం వేస్తే వయసు పైబడినా వీపు వంగదని అంటారు. కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది.

శలభాసనం

శలభాసనము జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఈ ఆసనం వేయడానికి మొదట మీ కడుపుపై ​​పడుకోండి. ఆపై రెండు చేతులను మీ శరీరానికి దగ్గరగా తీసుకురండి. ఆ తర్వాత మీ తల, కాళ్ళను నెమ్మదిగా పైకి లేపండి. తద్వారా మీ ఛాతీ మాత్రమే చాపను తాకుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. వెన్నెముక ఆరోగ్యం మెరుగుపడుతుంది, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

సర్వాంగాసనం

సర్వాంగాసనం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. సర్వాంగాసనం చేయడం వల్ల స్పెర్మ్ లోపం, రక్త లోపం, కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. ఈ ఆసనం సాధన చేయడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. థైరాయిడ్ సమస్య కూడా చాలా మంచి ఆసనం. దీనిద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనితో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, పొత్తికడుపు ఊబకాయం సమస్య ఉండదు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

అర్ధమత్స్యాసనం

మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలను నియంత్రించడంలో అర్ధమత్స్యాసనం చాలా సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల జీర్ణక్రియ చాలా బాగుంటుంది. ఇది అనేక కడుపు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉంటే ఈ ఆసనం సాధన చేయడం వల్ల హార్మోన్లను సమతుల్యంగా ఉంచుకోవచ్చు. కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా ఈ ఆసయం వేయాలి.

యోగాసనాలు శరీరానికి చాలా మంచివి. మీకు అనేక ఆరోగ్య ప్రయోజనలు అందిస్తాయి. శరీరం ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి యోగా బయటపడేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు పైన చెప్పిన యోగాసనాలు వేయండి.

తదుపరి వ్యాసం