తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : జీవితంలో అన్ని సార్లు స్మార్ట్ వర్క్ పనికిరాదు.. హార్డ్ వర్క్ చేయాల్సిందే

Wednesday Motivation : జీవితంలో అన్ని సార్లు స్మార్ట్ వర్క్ పనికిరాదు.. హార్డ్ వర్క్ చేయాల్సిందే

Anand Sai HT Telugu

22 May 2024, 5:00 IST

google News
    • Wednesday Motivation In Telugu : టెక్నాలజీ పెరిగింది.. అందరూ స్మార్ట్ వర్క్ అంటూ ఊదరగొడుతున్నారు. కానీ నిజానికి హార్డ్ వర్క్ చేయడం గురించి మరిచిపోతున్నారు.
బుధవారం మోటివేషన్
బుధవారం మోటివేషన్ (Unsplash)

బుధవారం మోటివేషన్

చాణక్యుడి మాటలు ఏ వయస్సు వారికైనా సంబంధించినవి. చాణక్య నీతి అనుసరించడం అనేక సమస్యల నుండి కాపాడుతుంది. చాణక్య నీతి మానవ జీవితాన్ని సంతోషకరమైన, విజయవంతమైన అనేక విషయాలను చెబుతుంది. చాణక్యుడి మాటలు పాటిస్తే మీ గౌరవం పెరుగుతుంది. జీవితాన్ని సరళంగా, సంతోషంగా మార్చుకోవడానికి అనేక మార్గాలు చాణక్య నీతిలో వివరించాడు.

జీవితంలో చాణక్యుడి మాటలను పాటిస్తే పెద్ద కష్టాన్ని కూడా సులభంగా అధిగమించవచ్చు. చాణక్య నీతిలో పురుషుల కొన్ని లక్షణాలు కూడా వివరించాడు. ఈ లక్షణాలను కలిగి ఉన్న పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులవుతారు. చాణక్య నీతిలో పేర్కొన్న పురుషుల లక్షణాలు ఏంటో చూద్దాం..

చాణక్యుడు ప్రకారం స్త్రీలు నిజాయితీ, నమ్మదగిన పురుషులను ఇష్టపడతారు. సాధారణంగా స్త్రీలు అబద్ధాలు చెప్పే పురుషులకు దూరంగా ఉంటారు. నిజాయితీ గల వ్యక్తి ఎల్లప్పుడూ నిజమైన మార్గాన్ని అనుసరిస్తాడు. అటువంటి వారు ఎప్పుడూ తప్పు చేయరు. నిజాయితీపరులైన పురుషులతో కలిసి జీవించడం వల్ల స్త్రీలు సంతోషంగా ఉంటారనే నిజం. స్త్రీలు నిజాయితీ గల పురుషుల పట్ల త్వరగా ఆకర్శణకు గురవుతారు.

తగిన గౌరవం ఇచ్చే పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులవుతారని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలందరూ తమ భాగస్వామి గౌరవించాలని కోరుకుంటారు. అలాంటి పురుషులు చాలా దృఢంగా ఉంటారు. అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వింటారు. మహిళలు తక్షణమే అలాంటి పురుషుల పట్ల ఆకర్షితులవుతారు. తమకు వారితో గౌరవం లభిస్తుందని భావిస్తారు.

చాణక్య నీతి ప్రకారం, స్త్రీలు మర్యాదగల పురుషులను త్వరగా ఇష్టపడతారు. అహంకారం లేని ఏ తప్పు జరిగినా వినయంతో అంగీకరించే పురుషులు చాలా అరుదు. పురుషుల ఈ గుణం బంధంలో మధురానుభూతిని తెస్తుందని మహిళలు నమ్ముతారు. మనిషి మొదట మర్యాదగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అప్పుడే ఆనందంగా ఉంటారు.

మంచి నడవడిక ఎవరి మనసునైనా గెలుచుకోగలదని అంటారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాడు. మహిళలు తరచుగా సాధారణ వ్యక్తిత్వం ఉన్న పురుషులను ఇష్టపడతారు. మహిళలు నిశ్శబ్దంగా ఉండే పురుషులకు ఆకర్షితులవుతారు. సౌమ్యుడైన వ్యక్తితో ప్రేమలో పడతారని చాణక్య నీతి అంటుంది.

మహిళలు బోల్డ్ పురుషులను ప్రేమిస్తారు. ఎందుకంటే ఎలాంటి సమయంలోనైనా తమకు అలాంటివారు రక్షణగా ఉంటారని స్త్రీలు నమ్ముతారు. అందుకే మహిళలు బోల్డ్ పురుషులను త్వరగా ఇష్టపడతారు.

మాట్లాడే విషయాలపై శ్రద్ధ వహించాలని, వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్త్రీలు కోరుకుంటారు. స్త్రీలు తమ చిన్న చిన్న చర్యలను కూడా చాలా శ్రద్ధగా వినే పురుషులను చాలా త్వరగా ఇష్టపడతారు. మహిళలు తమ హృదయాల్లో అలాంటి పురుషులకు సులభంగా చోటు కల్పిస్తారు. అందుకే అలాంటివారితో కలిసి ఉండేందుకు ఇష్టపడుతారు.

తదుపరి వ్యాసం