HeadBath: పురాణాలు చెబుతున్న ప్రకారం స్త్రీలు ప్రతిరోజూ తలంటు స్నానాలు చేసుకోవచ్చు. వారికి ఈ రోజు చేయకూడదు, ఆరోజు చేయకూడదు అనే నిబంధనలు ఏమీ లేవు. కాబట్టి స్త్రీలు ఏ రోజు స్నానం చేసినా కూడా వారికి అంతా మంచే జరుగుతుంది. కానీ పురుషులకు మాత్రం అలా కాదు. ప్రత్యేక దీక్షలో ఉన్నప్పుడు లేదా వ్రతాలు చేసేటప్పుడు తప్ప మిగతా రోజుల్లో కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. వారంలో కొన్ని రోజుల్లో తలస్నానం చేయడం వల్ల వారికి నష్టం జరిగే అవకాశం ఉంది. వారు ఏ రోజు తలస్నానం చేయాలో, ఏ రోజు చేయకూడదో తెలుసుకోండి.
పురుషులు ఆదివారం తలస్నానం చేయడం వల్ల అధిక వేడికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం తలస్నానం చేస్తే మంచిది. మంగళవారం మాత్రం మగవారు తలస్నానం చేయకూడదు. అది వారికి మంచిది కాదు. బుధవారం మాత్రం తలస్నానం చేయవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గురువారం తలస్నానం చేయకూడదు. చేస్తే ధన నష్టం తప్పదని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం కూడా మగవారు తలస్నానం చేయకూడదు. కొన్ని రకాల ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శనివారం పురుషులు తలస్నానం చేయవచ్చు. దీనివల్ల భోగాలు దక్కవచ్చు.
పురుషులు ఏ రోజు తలస్నానం చేయకూడదో తెలుసుకొని ఆరోజు తలంటు స్నానాలకు దూరంగా ఉండటమే మంచిది. ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానం, కాబట్టి ఆడవాళ్లు శుక్రవారం, మంగళవారం కూడా తలస్నానం చేస్తారు. అయితే ధర్మశాస్త్రాలు మాత్రం శుక్రవారం లేదా మంగళవారం ఆడవాళ్లు కూడా తలస్నానం చేయకూడదని చెబుతున్నాయి. అయితే పురాణ కాలం నుంచి శుక్రవారం తప్పకుండా తలస్నానం చేయడం అనేది ఆడవారు అలవాటుగా మార్చుకున్నారు.
ఆడవారు తలస్నానం చేసేటప్పుడు జుట్టు మొత్తం విరబోసుకుని చేయడం మంచి పద్ధతి కాదు. జుట్టు చివరన ఒక ముడి వేసుకోవాలి. ఆ తర్వాతే తలస్నానం చేయాలి. తలస్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయడం వల్ల మంచి ఫలితాలు రావు. కేవలం ఉదయం పూట మాత్రమే చేయాలి. సూర్యోదయానికి ముందే చేస్తే మరీ మంచిది. ఆహారం తిన్నాక చేస్తే అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆడా మగా ఇద్దరూ కూడా కచ్చితంగా శనివారం తలస్నానం చేయడం చాలా మంచిది. ఇది కుటుంబ సౌఖ్యానికి మేలు జరుగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. ఎంతో శుభకరం కూడా. శుక్రవారం తలస్నానం చేస్తే అశాంతి దక్కే అవకాశం ఉంది. కాబట్టి శనివారం ప్రతి ఒక్కరు తలస్నానం చేయడం అలవాటుగా మార్చుకుంటే మంచిది.
పైన చెప్పిన నిబంధనలన్నీ వారానికి రెండు మూడు సార్లు మాత్రమే తలస్నానం చేసే వారికి వర్తిస్తాయి. ప్రతిరోజూ తలస్నానం చేసే వారికి ఇవేవీ వర్తించవు. అయితే ఎవరైనా కూడా నెలలో ఒకటి రెండు సార్లు స్నానపు నీటిలో చిటికెడు పసుపు, కర్పూరం పొడి వేసుకొని తలస్నానం చేస్తే గ్రహదోష నివారణలు జరుగుతాయి.
టాపిక్