తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Food : సమ్మర్​లో ఈ ఫుడ్ తినొద్దు.. ఇవి తాగొద్దు

Summer Food : సమ్మర్​లో ఈ ఫుడ్ తినొద్దు.. ఇవి తాగొద్దు

HT Telugu Desk HT Telugu

14 February 2023, 13:37 IST

    • Summer Food Tips : ఎండాకాలం వస్తోంది.. ఇప్పటికే వేడి మెుదలైంది. ఉపశమనం కోసం.. ఐస్ క్రీములు, శీతలపానీయాల వైపు చూస్తారు చాలామంది. అయితే వాటిని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
సమ్మర్ ఫుడ్
సమ్మర్ ఫుడ్

సమ్మర్ ఫుడ్

ఎండాకాలం.. అలా కాస్త బయటకు వెళితే.. నీరసం అయిపోతాం. దీంతో కూల్ డ్రింక్స్(Cool Drinks), ఐస్ క్రీమ్స్ తినాలని చూస్తారు. అందులో కెలోరీలు అధికంగా ఉంటాయి. వాటికి దూరంగా ఉండటమే మంచిది. శరీరాన్ని చల్లగా ఉంచే పండ్లు(Fruits), కూరగాయలను రోజూవారీ ఆహారంలో తీసుకోవడం మంచిది. ఎండాకాలం చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్తుంది. ఎప్పుడూ నీళ్ల సీసా దగ్గర పెట్టుకోవాలి. నీరు తీసుకుంటే.. శరీరం హైడ్రేట్ అవుతుంది. చల్లదనం వస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Monday Motivation: ఎవరి గొప్ప వారిదే, జీవితంలో ఎదురయ్యే ఎవరినీ చులకనగా చూడకండి

Acid Reflux At Night : రాత్రి గుండెల్లో మంట రావడానికి కారణాలు.. ఈ అసౌకర్యాన్ని ఎలా తొలగించాలి?

Relationship Tips : పెళ్లికి ముందే ఈ 5 విషయాలు చర్చించండి.. లేదంటే తర్వాత సమస్యలు

Cashew Tomato Gravy : టొమాటో జీడిపప్పు గ్రేవీ తయారు చేయండి.. ఎంజాయ్ చేస్తూ తింటారు

ప్రోటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంచే మంచిది. స్ట్రాబెర్రీలు తీసుకోండి. చర్మానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. చర్మ స్వరూపం, రంగు బెటర్ అవుతాయి. పుచ్చకాయ(watermelon) కూడా తీసుకోవాలి. చర్మాన్ని సంరక్షించే లైకోపీన్‌తోపాటు 92 శాతం నీటిని కలిగి ఉంటుంది.

సమ్మర్(Summer) అంటే.. చెమట బయటకు వస్తుంది. అందుకే నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పలుచటి మజ్జిగా తాగితే మంచిది. కొంతమంది తీపి అంటే చాలా ఇష్టం.. అలాంటి వారు మామిడిపండ్లు తీసుకోండి. రసం ఇంట్లోనే చేసుకుని తాగండి. మిఠాయిలు మాత్రం తినకండి. మామిడి(Mango)లో ఫైబర్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి.

ఎండాకాలంలో కూరగాయలు, పండ్లను భోజనంలో భాగం చేసుకుంటే మంచిది. శరీరానికి పోషకాలు అందించాలి. నీటిశాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఎండవేడిని తట్టుకునేందుకు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలు సహా విటమిన్ సీ, వృక్ష రసాయనాలతో సమృద్దమై అంగూర్ పండ్లు టైప్ 2 మధుమేహం నుంచి రక్షిస్తాయి. ఇందులో సహజమైన తీపితోపాటుగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కర్భూజ కూడా శరీరానికి మంచిది.

చక్కెర(Sugar), తేనె(Honey) లాంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. వాటికి బదులుగా పండ్లు, కూరగాయలను ఆహారంలో పెంచండి. మసాలా, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించుకుంటే బెటర్. పండ్లు, కూరగాయల్లో సహజంగా ఉండే ఉప్పును గ్రహించడం కారణంగా.. శరీరంలో లవణాల శాతం సమతుల్యం అవుతుంది. ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆల్కహాల్(alcohol), కెఫిన్ ఉన్న పానీయాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, చక్కెర నీళ్లను దూరంగా పెట్టాలి. చల్లని కూల్ డ్రింక్స్.. తాత్కలికంగా ఉపశమనం కలిగించినా.. తర్వతా ఎఫెక్ట్ అవుతాయి. శరీరం చల్లబడేందుకు దోహదపడవు.

తదుపరి వ్యాసం