తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Swapna Shastra : ఎలా నిద్రపోతే చెడు కలలు రాకుండా ఉంటాయి?

Swapna Shastra : ఎలా నిద్రపోతే చెడు కలలు రాకుండా ఉంటాయి?

Anand Sai HT Telugu

09 December 2023, 20:00 IST

google News
    • Meaning Of Dream : కొంతమందికి రోజూ చెడు కలలు వస్తూ ఇబ్బంది పెడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయపడొచ్చు. మీ పడకగదిలో కొన్ని మార్పులు చేయాలి.
కలలు వాటి అర్థాలు
కలలు వాటి అర్థాలు (unsplash)

కలలు వాటి అర్థాలు

మంచి నిద్ర వస్తేనే మనం పగటిపూట ఉల్లాసంగా ఉండగలం. కానీ చాలా మందికి చెడు కలలు వస్తుంటాయి. అలాంటివారు పడకగదిలో కొన్ని మార్పులు చేస్తేనే పీడకలల సమస్య నుంచి తప్పించుకోవచ్చు. నిద్ర సరిగా లేకుంటే చేసే పని మీద శ్రద్ధ ఉండదు. దీంతో అనేక ఇబ్బందులు వస్తాయి. చెడు కలల గురించి స్వప్న శాస్త్రం చాలా విషయాలు చెప్పింది. ఎలా పడుకుంటే రాకుండా ఉంటాయో కూడా వివరించింది. ఆ పరిష్కారం ఏంటో తెలుసుకుందాం.

మంచి నిద్రతోనే మంచి ఆరోగ్యం. అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ పనుల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు మంచం మీద పడిపోవడం సహజం. అయితే కొంతమందికి నిద్రలో చెడు కలలు వస్తుంటాయి. దీంతో నిద్రించడానికి భయపడే వారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నట్లయితే, మీ ఇంటి వాస్తులో కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది.

మీరు మీ నిద్రించే దిశ, మీ పడకగదిలో మీరు ఉంచే వస్తువులు మీ పీడకలలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెడు కలలు రాకుండా ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలి.

కర్పూరం సానుకూలతకు చిహ్నంగా పరిగణిస్తారు. మీరు పడుకునే ముందు కర్పూరాన్ని మీ మంచం దగ్గర ఉంచాలి. ఇది పీడకలలను మీపైకి రానివ్వదు. ఇది కాకుండా, మీరు పడకగదిని తుడవడానికి ముందు, నీటిలో చిటికెడు ఉప్పు వేసి, ఆపై దానిని గుడ్డతో తుడవండి. ఇలా చేయడం వల్ల బెడ్‌రూమ్‌లోని ప్రతికూల అంశాలు తొలగిపోతాయి.

పడకగదిలో ఉండే కర్టెన్ల రంగు కూడా మీ చెడు కలలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చెడు కలలతో బాధపడేవారు లేత నీలం రంగు కర్టెన్లు, బెడ్ షీట్లు వాడాలి.

మీరు చాలా కాలంగా చెడు కలలతో బాధపడుతున్నట్లయితే మంచం దగ్గర రాగి పాత్రను ఉంచాలి. చిన్న పిల్లలకు కూడా పీడకలలు వస్తే మెడలో రాగి కూడిన గొలుసును ధరించవచ్చు. రాగి నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని చెబుతారు.

మీరు నిద్రించే దిశ మీ కలలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీకు చెడు కలలు వస్తుంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో పడుకోవాలి. ఇది మీ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.

తదుపరి వ్యాసం