తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  జీన్స్ ప్యాంటుకు చిన్న పాకెట్స్, బటన్లు ఎందుకు ఉంటాయో తెలుసా?

జీన్స్ ప్యాంటుకు చిన్న పాకెట్స్, బటన్లు ఎందుకు ఉంటాయో తెలుసా?

HT Telugu Desk HT Telugu

13 March 2022, 11:47 IST

google News
    • జీన్స్ ప్యాంటు ముందు భాగంలో చిన్న పాకెట్‌ను   చూశాం ఉంటాం  కదా... ఈ  పాకెట్ ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యాంట్ కుడి వైపున ఉన్న చిన్న జేబు వాటి ఉండే చిన్న బటన్ల మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం
Jeans
Jeans

Jeans

కాలం మారుతుంది దానికి తగ్గట్టుగా భాషా, వేషాధారణ మారుతుంది. ముఖ్యంగా యువత న్యూ లుక్స్‌తో, అబ్బురపరిచే స్టైల్స్‌తో నూతన పోకడలను అలవరుచుకున్నారు. యాక్సెసరీలు, ప్యాషన్‌ హవాతో నాగరికత పూర్తిగా మారిపోయింది. గ్రాండ్స్ లుక్స్‌లో కనిపించాలన్నా యువత ఆలోచనకు తగ్గట్టుగా కొత్త.. కొత్త ఫ్యాషన్ దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఫ్యాషన్ దుస్తులలో జీన్స్ ప్యాంట్‌ల మంచి క్రేజ్ ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా జీన్స్ ప్యాంట్లు ఫ్యాషన్‌కు కేంద్రంగా మారాయి. యువతలో జీన్స్ ప్యాంట్‌కు ఆదరణ విపరీతంగా పెరిగింది. వాటికి ఉన్న ముఖ్య అడ్వాంటేజ్ ఏమిటంటే దీనిని ఏ కాలంలోనైనా ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది. అయితే చాలా మందికి జిన్స్ ప్యాంట్ వేసుకోవడం తెలుసు కానీ వాటిలో ఉన్న ప్రత్యేకమైన ప్యాకెట్ల గురించి చాలా మందికి తెలియదు.

ప్యాంటు ముందు భాగంలో చిన్న పాకెట్‌ను గమనించి ఉంటాం. ఈ చిన్న పాకెట్ ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫ్యాంట్ కుడి వైపున ఉన్న చిన్న జేబు వాటి ఉండే చిన్న బటన్ల మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది చిన్న పాకెట్, బటన్లను ఫ్యాషన్ కోసం అని అనుకుంటారు.

జీన్స్ ప్యాంటుపై చిన్న జేబు వెనుక కారణం

గతంలో వ్యాపారాలు చేసే వాళ్లు తమ జాగ్రత్త కోసం, లేదా పశువుల కాపరులు, గుర్రాలపై స్వారీ చేసే పనిలో ఉండే వాళ్లు, కౌబాయ్ లా తిరిగేవాళ్ల అవసరాల కోసం తమ గడియారాన్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ప్రముఖ జీన్స్ సంస్థ లెవిస్ స్ట్రాస్ ఈ బుల్లి పాకెట్ కు శ్రీకారం చుట్టిందట.

అసలు దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే మీరు అశ్చర్యపోతారు కూడా.. ఇంతకూ ఆ బుల్లి పాకెట్ ఎందుకంటే అందులో గడియారం (watch) పెట్టుకోవడానికట. వినడానికి ఇది కాస్త వింతగా ఉంది కదా.. జీన్స్ ప్యాంట్‌కి కుడి వైపున ఉన్న ఈ చిన్న పాకెట్ జీన్స్ పుట్టినప్పటి నుండి ఉంది. జీన్స్ ప్యాంటు నిజానికి మైనర్ల కోసం పుట్టింది. అప్పట్లో చేతి గడియారాలు లేవు. ఆ సమయంలో జేబులో పాకెట్‌లో పెట్టుకునే వాచీలు ఉండేవి. కార్మికులు, పశువుల కాపరులు, గుర్రాలపై స్వారీ చేసే వారు వాచీలను ముందు జేబులో పెట్టుకుని ఉంటే, అవి పగిలిపోవడమో, లేదా పాడైపోవడమో జరిగేవి. ఈ సమస్యకు పరిష్కారంగా తమ గడియారాన్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ప్రముఖ జీన్స్ సంస్థ లెవిస్ స్ట్రాస్ ఈ బుల్లి పాకెట్‌ను ఏర్పాటు చేసింది. అప్పుడే జీన్స్‌లో ఈ చిన్న పాకెట్ పుట్టింది. తర్వాత ఇది జీన్స్ లో అంతర్భాగంగా మారింది. ఇప్పుడు ఈ చిన్న జేబు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇక బటన్లు విషయానికి వస్తే.. జీన్స్‌ పుట్టినప్పటి నుంచి జేబు వైపు చిన్న బటన్‌లు ఉన్నాయి. అయితే ప్యాంట్ చాలా దృఢంగా ఉన్నప్పటికి వాటి జేబుల మాత్రం త్వరగా చిరిగిపోతూ ఉండేవి. అటువంటి పరిస్థితిలో, టేలర్ జాకబ్ డేవిస్ ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. జీన్స్ పాకెట్ పక్కన చిన్న చిన్న మెటల్ ముక్కలు వేయడం మొదలుపెట్టాడు.

 

తదుపరి వ్యాసం