తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Womens Health Tips : అబార్షన్ తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే!

Womens Health tips : అబార్షన్ తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే!

HT Telugu Desk HT Telugu

30 September 2022, 19:15 IST

  • Womens Health tips : అబార్షన్ తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

abortion
abortion

abortion

మాతృత్వపు అనుభావం అత్యంత అందమైన అనుభూతి. బిడ్డకు జన్మనిచ్చే సమయం తీవ్రమైన బాధతో కూడిన అయినప్పటీకి.. మాతృత్వ భావం చాలా ఆహ్లాదకరమైనది . అయితే, మహిళలు బిడ్డకు జన్మనిచ్చే (Women health tips) సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో అబార్షన్ కేసులు పెరుగుతున్నాయి. తల్లి అవుతున్న వార్త స్త్రీలకు ఎంతటి ఆనందాన్ని ఇస్తోందో.. దురదృష్టవశాత్తూ అబార్షన్ అవ్వడం వల్ల ఆ బాధ వర్ణతీతంగా ఉంటుంద. కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు మధ్య గర్భం పోతుంది. ఈ సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. అధిక రక్తస్రావం కారణంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది రక్తహీనత సమస్యకు దారి తీస్తుంది. స్త్రీలు తరచూ తల తిరగడం, తలనొప్పి, అశాంతి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటి సమయాల్లో స్త్రీల ఆహారం (అబార్షన్ డైట్) వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. అబార్షన్ తర్వాత మహిళలు తీసుకునే ఆహారం ఎలా ఉండాలనే వివరంగా తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

కాల్షియం అధికంగా ఉండే ఆహారం

అబార్షన్ తర్వాత కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దీని కోసం మీరు మీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్, సీఫుడ్, పాలు, పాల ఉత్పత్తులు, ఆకు కూరలు చేర్చుకోవచ్చు

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి

చాలా మంది మహిళలు అబార్షన్ తర్వాత వాంతులు, వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో జీర్ణ సమస్యలు వస్తాయి. శరీరంలో హార్మోన్ల మార్పులు ఈ సమస్యలకు కారణమవుతాయి. అలాంటి సమయంలో స్త్రీలకు చెమట పట్టకూడదు. కాబట్టి పుష్కలంగా నీరు త్రాగండి మరియు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి. ఈ సమయంలో మీరు మీ ఆహారంలో వివిధ సూప్‌లు మరియు పానీయాలను చేర్చుకోవచ్చు.

ఫోలిక్ ఆమ్లం

ఫోలిక్ యాసిడ్ మానసిక ఒత్తిడి, ఎర్ర కణాల వృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రక్తహీనత వంటి సమస్యలను కూడా నయం చేస్తుంది. కాబట్టి, అబార్షన్ తర్వాత తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్ ఆహారాన్ని తీసుకోవాలి. దీని కోసం మీరు మీ ఆహారంలో అవకాడో, బాదం, వాల్‌నట్‌లను చేర్చుకోవాలి.

ఇష్టమైన ఆహారాలు తినండి

మీ మనస్సుతో పాటు మీ శరీరం కూడా సంతోషంగా ఉండటానికి మీకు ఇష్టమైన ఆహారాన్ని తినండి. ఈ కాలంలో మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు ఇష్టమైన ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఏమి తినకూడదు?

అబార్షన్ తర్వాత నివారించాల్సిన కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఈ కాలంలో జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తినకూడదు. అలాగే ఎలాంటి ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి. ఎక్కువసేపు ఆకలితో ఉండకండి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న చక్కెర ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. మిఠాయి, కార్బోనేటేడ్ పానీయాలను నివారించండి. యోగా , ధ్యానం కూడా ప్రయత్నించండి.

తదుపరి వ్యాసం