Dreams and Meanings : పెళ్లి చేసుకున్నట్టుగా కల వస్తే మంచిదేనా? దీని అర్థమేంటి?
01 December 2023, 18:30 IST
- Meaning Of Dreams : స్వప్న శాస్త్రం వివిధ కలల గురించి వివరిస్తుంది. కొందరు కలలో పెళ్లి చేసుకోవడం చూస్తుంటారు. అయితే ఇది మంచిదేనా? అని చాలా మందికి అనుమానం ఉంటుంది. దీని అర్థం ఏంటి?
స్వప్న శాస్త్రం
పెద్దయ్యాక పెళ్లి గురించి పగటి కలలు కనడం సహజం. ఆ వయసులో పెళ్లి చేసుకోవాలనుకోవడం మామూలే. కానీ మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు పెళ్లి గురించి కలలుగన్నట్లయితే, ఆ కలకి ప్రత్యేక అర్థం ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం వివాహ గురించి కల అంటే ఏంటో తెలుసుకుందాం.
కలలు కనడం ఒక సాధారణ ప్రక్రియ. ప్రతి ఒక్కరూ రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటారు. కొన్నిసార్లు భయంకరమైన కల మనల్ని నిద్ర నుంచి లేచేలా చేస్తుంది. కొన్నిసార్లు ఫన్నీ కల మనల్ని నవ్విస్తుంది. కొన్నిసార్లు రహస్యమైన కల మనల్ని ఆలోచించేలా చేస్తుంది. కలలు అనేక రూపాల్లో వస్తాయి కాబట్టి, ప్రతి కలకి దాని ప్రత్యేక అర్థం ఉంటుంది. స్వప్న శాస్త్రం.. ఈ కలల గురించి వివరిస్తుంది.
వివాహ కలకి సంబంధించిన కలల వివరణ గురించి తెలుసుకుందాం. పెళ్లి గురించి పగటి కలలు కనడం మామూలే. మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు పెళ్లి గురించి కలలు కన్నట్లయితే, ఆ కలకి అర్థం ఉంటుంది. కల శాస్త్రం ప్రకారం పెళ్లి కల దేని గురించి చెబుతుందో చూద్దాం..
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది తమ పెళ్లి గురించి కలలు కంటారు. కానీ కలలో మీరు పెళ్లి చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఇలా కలలు కనడం వల్ల మీ భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని సూచిస్తుంది. డ్రీమ్ సైన్స్ ప్రకారం, వివాహ కల అరిష్ట సూచన.
మీరు కలలో మళ్లీ పెళ్లి చేసుకోవడం చూస్తే, మీరు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండరని అర్థం. అలాగే, ఈ రకమైన కల భవిష్యత్తులో వైవాహిక జీవితంలో భంగం కలిగించవచ్చని సూచిస్తుంది.
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో మీ పెళ్లి ఊరేగింపును చూడటం శుభప్రదం. అలాంటి కల అంటే మీరు సమాజంలో గౌరవం, ప్రతిష్టను పొందుతారు. రాబోయే కాలంలో మీ సోషల్ నెట్‌వర్క్ పరిధి పెరుగుతుంది. ఇది రాబోయే కాలంలో మీకు ప్రయోజనాలను తెస్తుందని అర్థం. మీరు జీవితంలో విజయం సాధిస్తారని దీని అర్థం.
స్వప్న శాస్త్రం కలల గురించి లోతుగా అధ్యయనం చెబుతాయి. దీని ప్రకారం ప్రతి కలకి ఒక అర్థం ఉంటుంది. కల భవిష్యత్తుకు గురించి చెబుతుంది. కలలు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి హెచ్చరిక ఇస్తాయని డ్రీమ్ సైన్స్ వివరిస్తోంది. కలలో కనిపించే కొన్ని వింత సంఘటనలు మనల్ని కలవరపరుస్తాయి. కలలో ఈ విషయాలు చూసి.. ఆందోళన చెందుతాం.. ఉలిక్కిపడి లేస్తాం. అయితే వీటిలో కొన్ని శుభ ఫలితాలను ఇస్తే, మరికొన్ని అశుభ ఫలితాలను ఇస్తాయి.
గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.