Dreams and Meanings : కలలో చిలక, గులాబీ పువ్వు కనిపిస్తే అర్థమేంటి?
19 November 2023, 18:15 IST
- Meaning Of Dreams : స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కొన్ని విషయాలు చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కలలో కింద చెప్పే విషయాలను చూసే వ్యక్తికి భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
కలలు వాటి అర్థాలు
కలల గురించే చెప్పే శాస్త్రాన్ని స్వప్న శాస్త్రం అంటారు. మనం చూసే ప్రతి కల మనలో రకరకాల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. కొన్నిసార్లు కలలు గందరగోళంగా ఉంటే, కొన్నిసార్లు అవి ఆనందంగా ఉంటాయి. కొన్ని కలలు ఆశ్చర్యంగా ఉంటే, మరికొన్ని సంతోషాన్నిస్తాయి. ఫన్నీ కల నవ్వును తెప్పిస్తాయి, విచారకరమైన కల కన్నీళ్లను తెప్పిస్తుంది. అయితే ఈ కలల్లో ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. మనం చూసే ప్రతి కల వెనుక భవిష్యత్తుకు సంబంధించిన సూచన ఉంటుందని డ్రీమ్ సైన్స్ చెబుతోంది.
కలలు కనడం సహజమైన చర్య. రాత్రి పడుకునేటప్పుడు మనందరికీ కచ్చితంగా కొన్ని కలలు వస్తాయి. కానీ కలలు మనకు అనేక రకాల శుభ లేదా అశుభ సంకేతాలను ఇస్తాయి. నిజజీవితంలో జరిగిన సంఘటనలు కలలో వచ్చినట్లే.. నిజజీవితంలో జరగబోయే మంచి సంఘటనలు సంకేతాలను కలలు చెబుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో కనిపించే కొన్ని విషయాలు మన భవిష్యత్తుకు సంబంధించినవి. కలలో కొన్ని వస్తువులను చూడటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు.
డ్రీమ్ సైన్స్ ప్రకారం, మీ కలలో గులాబీ పువ్వును చూడటం చాలా శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఈ రకమైన కల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. దీని అర్థం ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి లేదా మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఈ కల అర్థం ఏమిటంటే, త్వరలో మీ ఇంట్లో ఆనందం వ్యాపిస్తుంది. మీ చిరకాల కలలలో ఒకటి త్వరలో నెరవేరుతుంది.
స్వప్న శాస్త్రంలో చిలుకను శుభప్రదంగా పరిగణిస్తారు. మీ కలలో చిలుకను చూడటం కూడా చాలా శుభప్రదంగా చెబుతారు. మీరు త్వరలో కొన్ని శుభవార్తలను అందుకోబోతున్నారని, మీ జీవితం ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుందని అర్థం.
వ్యాపారంలో నిమగ్నమైన వ్యక్తి తన కలలో పండ్లతో నిండిన చెట్టును చూస్తే, అతను వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతాడని అర్థం. ఆ వ్యక్తులు చాలా ఆనందం, సంపదను పొందుతారని ఈ కల చెబుతుంది. వారి వ్యాపారం వేగంగా విస్తరిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.