తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మీ ఇంట్లో 5 ఏళ్ళ లోపు పిల్లలు ఉన్నారా?.. అయితే బ్లూ ఆధార్‌‌కి అప్లై చేసుకోండిలా!

మీ ఇంట్లో 5 ఏళ్ళ లోపు పిల్లలు ఉన్నారా?.. అయితే బ్లూ ఆధార్‌‌కి అప్లై చేసుకోండిలా!

HT Telugu Desk HT Telugu

30 April 2022, 16:56 IST

google News
    • భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సంవత్సరాలలోపు పిల్లల కోసం ‘బాల ఆధార్‌ (Baal Aadhaar)ను జారీ చేస్తుంది. బయోమెట్రిక్‌ వివరాలు సేకరించకుండానే ఈ కార్డును అందజేస్తారు.
Blue Aadhaar
Blue Aadhaar

Blue Aadhaar

ఈ రోజుల్లో ఆధార్‌ కార్డు (Aadhaar card) ఎంతటి ప్రాముఖ్యత కలిగిన డాంక్యుమెంటో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడిది అనేక వ్యవహారాల్లో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిగణించబడుతుంది. సాధారణంగా ఆధార్‌ కార్డులు తెలుపురంగులో ఉండడం చూసి ఉంటాం. అయితే ఇప్పుడు యూఐడీఏఐ పిల్లల కోసం ప్రత్యేకంగా నీలం రంగు ఆధార్‌ కార్డులను జారీ చేస్తోంది. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్డును విడుదల చేస్తున్నారు. దీన్ని ‘బాల ఆధార్‌ ’(Baal Aadhaar) అని  అంటారు.

ఈ కార్డులో పిల్లల ఫొటో, పేరుతో పాటు చిరునామా, తల్లిదండ్రుల పేరు వంటి ప్రాథమిక సమాచారం ఉంటుంది. నవజాత, మైనర్ పిల్లల కోసం పేరెంట్స్ బాల్‌ ఆధార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం తల్లి దండ్రులు.. పిల్లల బర్త్ సర్టిఫికెట్ లేదా ఆసుపత్రి నుండి పొందే డాక్యుమెంట్లను అందిస్తే సరిపోతుంది. అలా కాకుండా వారు చదువుతున్న పాఠశాలు అందించే  డాంక్యుమెంట్స్ అధారంగా  కూడా బాల ఆధార్‌ను పొందవచ్చు.

బాల ఆధార్‌ పొందే విధానం:

తల్లిదండ్రులు ఆధార్‌ కేంద్రానికి వెళ్ళి.. వారు ఆధార్‌ కార్డుతో పాటు పిల్లలకు సంబంధించిన పత్రాల (బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర డాంక్యుమెంట్ప్, ఫొటో)ను అక్కడ అందించాలి.

* ఆధార్‌ నమోదు ఫారంను నింపాలి. తర్వాత తల్లిదండ్రుల ఆధార్‌ వివరాలను జత చేయాలి.

* తల్లిదండ్రుల మొబైల్‌ నెంబరును ఖచ్చితంగా ఫారంలో నింపాల్సి ఉంటుంది. దీని అధారంగా పిల్లలకు ఆధార్‌ కార్డు నెంబర్‌ను రూపొందిస్తారు.

* పత్రాలను ధ్రువీకరించిన తర్వాత మొబైల్‌ నెంబరుకు ప్రక్రియ పూర్తైన  సందేశం వస్తోంది.

* 60 రోజులు తర్వాత పిల్లల పేరుపై నీలం రంగులో ఉండే బాల ఆధార్‌ కార్డు జారీ అవుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం