తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Swapna Shastram। పెళ్లి కలలు కంటున్నారా? అలాంటి కలలకు అర్థం ఇదే!

Swapna Shastram। పెళ్లి కలలు కంటున్నారా? అలాంటి కలలకు అర్థం ఇదే!

HT Telugu Desk HT Telugu

05 August 2023, 21:30 IST

google News
    • Swapna Shastram About Marriage: మీరు నిద్రలో పెళ్లి గురించి కలులు, పెళ్లి జరుగుతున్నట్లు కలలను కంటుంటే స్వప్నశాస్త్రం ప్రకారం దాని అర్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
Swapna Shastram About Marriage
Swapna Shastram About Marriage (istock)

Swapna Shastram About Marriage

Swapna Shastram About Marriage: పెళ్లి గురించి చాలా మంది అందమైన కలలు కంటారు. తనకు అందమైన భార్య రావాలని పెళ్లికాని మగవారు, తన కోసం రాకూమారుడు వచ్చి పెళ్లిచేసుకోవాలని కన్నెపిల్లలు, రెండో పెళ్లి గురుంచి కలలు, ఇలా చాలామందికి చాలా రకాల కలలు ఉంటాయి. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా నిద్రలో పెళ్లి కలలు వస్తుంటే దానికి కొన్ని అర్థాలు ఉన్నాయని స్వప్నశాస్త్రం చెబుతుంది. స్వప్నశాస్త్రం అనేది నిద్రలో వచ్చే కలల గురించి వివరించే ఒక గ్రంథం. ఇందులో మీకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం అంతరార్థం ఉంటుంది.

మీరు నిద్రలో పెళ్లి గురించి కలులు, పెళ్లి జరుగుతున్నట్లు కలలను కంటుంటే దాని అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కలలో పెళ్లి ఊరేగింపు చూడటం

కలలో మీరు మీ వివాహ ఊరేగింపును చూడటం చూస్తే, ఆ కల చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అలాంటి కల సమాజంలో మీ గౌరవం పెరుగుతుందని చెబుతుంది. రాబోయే కాలంలో, మీ సోషల్ నెట్‌వర్క్ పరిధి పెరుగుతుంది, దీని కారణంగా మీరు రాబోయే కాలంలో గొప్ప ప్రయోజనాలను పొందుతారు. మీకు సమాజంలో అందరి సహాకారం ఉంటుంది. మరోవైపు, మీరు ఇప్పటికే వివాహితులై ఉండి, ఇలాంటి కలలు వస్తుంటే అది అనుకూల సంకేతం కాదు. మీ వివాహబంధంలో సమస్యలు రావడానికి అది సూచిక కావచ్చు.

కలలో పెళ్లిదుస్తులు కనిపించడం

ఎవరైనా తమ కలలో తమని తాము సంతోషంగా, ఉల్లాసంగా పెళ్లి దుస్తులలో ఉన్నట్లు చూసినట్లయితే, అది ఆశావాద దృక్పథాన్ని సూచిస్తుంది, ఆ కల మీరు పెళ్లి సంబంధాక కోసం ఉబలాటపడుతున్నట్లు, ఒకరి సాంగత్యంలో శృంగారం కోసం కోరికను సూచిస్తుంది. మరోవైపు, ఎవరైనా తమ కలలో సాధారణ దుస్తుల్లో తాను వివాహం చేసుకోవడం చూస్తే, అది ఒక అశుభకరమైన సంఘటనను సూచిస్తుంది.

మీ వివాహం జరుగుతున్నట్లు కల వస్తే

స్వప్న శాస్త్రం ప్రకారం, మీ వివాహం జరుగుతున్నట్లు కల వస్తే అది అనుకూల సంకేతం కాదు. కలలో వివాహం చేసుకునే కల శ్రేయస్కరం కాదు. అది భవిష్యత్తులో జరిగే కొన్ని చెడు సంఘటనలను సూచిస్తుంది. అలాంటి కల వచ్చినపుడు కొంతకాలం పాటు జాగ్రత్తగా ఉండాలి అని కలల శాస్త్రం చెబుతుంది. అదే మీరు వేరొకరి పెళ్లి జరుగుతున్నట్లు కలగంటే అది శుభసూచకం, మీ జీవితంలో కొత్త ప్రారంభానికి అది చిహ్నం కావచ్చు.

మంచి కలలు కనండి, ఆ కలలను నెరవేర్చుకోండి. స్వీట్ డ్రీమ్స్, శుభరాత్రి!

తదుపరి వ్యాసం