Meaning Of Dream : కలలో బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా?
11 December 2023, 18:30 IST
- Dreams and Meanings : స్వప్న శాస్త్రం ప్రకారం వివిధ జంతువులు, పక్షులు మనకు కలలో కనిపిస్తాయి. వాటికి వేర్వేరు అర్థాలు ఉంటాయి. అయితే మీ కలలో ఎప్పుడైనా బల్లి కనిపించిందా? దీని అర్థమేంటి?
స్వప్న శాస్త్రం
గోడమీద బల్లి పాకడం చూసి చాలా మంది భయపడతారు. బల్లిని శకునము అని కూడా అంటారు. కానీ కలలో బల్లిని చూడటం వెనక కూడా అర్థం ఉంది. కలలో కనిపించే బల్లి వివిధ అర్థాలను చెబుతుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. నిజానికి కలల ప్రపంచంలో లెక్కలేనన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. కలలో చాలా విషయాలు చూడటం శుభప్రదంగా భావిస్తారు. కానీ మనకు కలలో కనిపించేవి కొన్ని దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. కలలు మన భవిష్యత్తుకు సూచిక అని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. నేటి స్వప్న శాస్త్రంలో కలలో బల్లి కనిపించడం అంటే ఏంటో తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం, మీ కలలో బల్లి పిల్ల కనిపిస్తే అది అశుభంగా పరిగణించబడుతుంది. ఈ కల మీ కొన్ని పని, కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు. భవిష్యత్తులో మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చని కూడా ఇది సూచిస్తుంది.
మీ కలలో కీటకాలను తినే బల్లిని చూస్తే, ఇది మీకు అరిష్ట సంకేతం అని అర్థం చేసుకోండి. మీరు ఇలా కలలుగన్నట్లయితే, మీరు మీ ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలను చూసుకుని పని చేయాలి.
బల్లి గోడకు పాకుతున్నట్టుగా లేదా కలలో బల్లి మీకు హాని కలిగిస్తుందని మీరు చూస్తే, అది చాలా అశుభ సంకేతంగా పరిగణించాలని స్వప్న శాస్త్రం చెబుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని మోసం చేసి ప్రయోజనం పొందవచ్చు.
మీ కలలో బల్లి భయంతో పారిపోతుంటే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఈ కల మీరు ఆర్థిక, సామాజిక రంగంలో చాలా ప్రయోజనాలను పొందుతారని, మీ కీర్తి చాలా పెరుగుతుందని సూచిస్తుంది.
మీరు బల్లిని చంపినట్లు కలలుగన్నట్లయితే, ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఇలా జరిగితే మీ జీవితంలో వచ్చే సమస్యల నుంచి తేలికగా బయటపడి మీ జీవితం చక్కగా సాగుతుందని అర్థం.
మీరు కలలో బల్లిని పట్టుకోవడం చూస్తే త్వరలో ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారని అర్థం. అంటే ఇలా చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన కథనం విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.. ఇందులోని అంశాలను ఆమోదించదు. మీ విచక్షణ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. సమాచారం అందించేందుకు మాత్రమే కథనం ఇచ్చాం.